ఎల్బీనగర్:
హయత్నగర్ కోర్టు పరిధిలోని న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి, కోర్టు ప్రాంగణంలో మౌలిక వసతులు మెరుగుపరచాలని కోరుతూ, హయత్నగర్ కోర్టు బార్ అసోసియేషన్ ప్రతినిధులు ఎల్బీనగర్ నియోజకవర్గ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని కోరడం జరిగింది.ఈ సందర్బంగా సుధీర్ రెడ్డి హయత్ నగర్ కోర్ట్ ప్రాంగణానికి విచ్చేసి లాయర్లతో కలిసి పరిశీలించడం జరిగింది.ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ, హయత్నగర్ కోర్టులో సుమారు 200 మంది న్యాయవాదులు కోర్టుకు వచ్చే కక్షిదారులు,ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కోర్టు ప్రాంగణంలో పార్కింగ్,రహదారులు,డ్రైనేజీ,తాగునీరు తదితర మౌలిక వసతులను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు.అలాగే కోర్టుకు వచ్చే ప్రజలు, న్యాయవాదులు ఇబ్బందులు పడకుండా అవసరమైన అభివృద్ధి పనులు చేపట్టాలని కోరారు.బార్ అసోసియేషన్ ప్రతినిధుల వినతిని సానుకూలంగా స్వీకరించిన ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి సంబంధిత సమస్యలను పరిశీలించి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో హయత్ నగర్ డివిజన్ భారాస పార్టీ అధ్యక్షులు చెన్నగోని శ్రీధర్ గౌడ్,భాస్కర్ సాగర్, బోడ బిక్షపతి,హయత్ నగర్ కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు పల్లె లింగంగౌడ్ తదితర లాయర్లు పాల్గొన్నారు.


