Tuesday, November 24, 2026
Google search engine
Homeతెలంగాణ26/11 తరహాలో హైదరాబాద్‌పై ఉగ్రదాడి హెచ్చరిక..

26/11 తరహాలో హైదరాబాద్‌పై ఉగ్రదాడి హెచ్చరిక..

దిల్‌సుఖ్‌నగర్‌లో పోలీసుల విస్తృత తనిఖీలు

ఎల్బీనగర్

ముంబై 26/11 తరహాలో నవంబర్ 26న హైదరాబాద్ నగరంపై దాడి చేసి కనీసం 300 మందిని పొట్టన పెట్టుకుంటామంటూ వచ్చిన హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో దిల్‌సుఖ్‌నగర్‌లోని 2013లో జంట బాంబు పేలుళ్లు జరిగిన ప్రాంతంలో సరూర్‌నగర్ పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు.బాంబు పేలుళ్లు జరిగిన ప్రాంతంతో పాటు పరిసర ప్రాంతాల్లోనూ పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భద్రతను కట్టుదిట్టం చేసినట్లు తెలుస్తోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments