- పేద కుటుంబానికి అండగా నిలిచిన సురక్ష సేవా సంఘం
- తల్లిదండ్రుల కడుపు కోత ఎవరూ తీర్చలేరు….
ఎల్బీనగర్
అబ్దుల్లాపూర్ మెట్ మండల కేంద్రంలోని జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీలో ఉంటున్న తిరుపతయ్య నిరుపేద, తన కుటుంబాన్ని తన కష్టంతో ఏదోలా నెట్టుకుంటూ వస్తున్న క్రమంలో తన కుమారుడు చేతికి అంది వచ్చాడని ఎంతో ఆశ పడ్డాడు..కానీ మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో వెంటాడింది. చిన్న కుమారుడు తీవ్ర గాయాలతో బయట పడగా, పెద్ద కుమారుడు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న సురక్ష బాధిత కుటుంబానికి ఓదార్చి గ్రూపు సభ్యుల సహకారంతో అంత్యక్రియలకు 14 వేల రూపాయలు సహాయం అందించారు..ఈ కార్యక్రమంలో సురక్ష సేవా సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిక్కర గోపీ శంకర్ యాదవ్ కాలనీ పెద్దలు డాక్టర్ ఉపేందర్, నరసింహ, యూసఫ్ భాయ్, అచ్చిని. మహేష్, యాకూబ్, అన్నుభాయ్, నాగేశ్వరరావు, శేఖర్, లక్ష్మీ, రాజేష్, శ్రీహరి, తదితరులు పాల్గొన్నారు.


