Friday, November 27, 2026
Google search engine
Homeతెలంగాణచైతన్యపురి డివిజన్ లో పారిశుద్ధ్య కార్మికులకు వైద్య శిబిరం

చైతన్యపురి డివిజన్ లో పారిశుద్ధ్య కార్మికులకు వైద్య శిబిరం

ఎల్బీనగర్:

సరూర్ నగర్ సర్కిల్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు చైతన్యపురి డివిజన్ లోని మాధవ రెడ్డి కమ్యూనిటీ హాల్‌లో గురువారం ప్రత్యేక ఆరోగ్య వైద్య శిబిరాన్ని నిర్వహించారు.సరూర్‌నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్ సమక్షంలో ఈ శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు అవసరమైన ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, వైద్య సేవలు అందించారు. విధి నిర్వహణలో నిరంతరం ప్రజారోగ్యం, పరిసరాల పరిశుభ్రత కోసం కృషి చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణే ఈ శిబిరం ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యం, సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ ఇలాంటి వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్ డిఈ చందన, డివిజన్ శానిటేషన్ సూపర్వైజర్, యంయంసీ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments