ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి..
వనస్థలిపురంలోని రెడీ టు సర్వ్ ఫౌండేషన్ ఫ్రీ ఓల్డ్ ఏజ్ హోమ్ నందు వైద్య పరికరాల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవి రెడ్డి సుధీర్ రెడ్డి విచ్చేసి ప్రారంభించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హాస్పిటలైజైన వారికోసం రెడీ టు సర్వ్ ఫౌండేషన్ వారు ఉచితంగా పేషంట్ అప్ అండ్ డౌన్ బెడ్స్, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, వీల్ చైర్స్, వాకర్స్ పూర్తి ఉచితంగా అందజేయడం జరుగుతుంది.. మీకు అవసరం ఉన్నన్ని రోజులు వాటిని వాడుకొని అవసరం తీరిన తర్వాత తిరిగి ఇవ్వవచ్చు. మీకు వారి సేవలు నచ్చితే డొనేషన్ చేయవచ్చు.. అదే విధంగా మీ వద్ద నిరుపయోగంలో ఉన్న హాస్పిటల్ బెడ్స్ కానీ, వీల్ చైర్స్ కానీ, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, మొదలగు వారికి ఇస్తే వారు నలుగురుకి ఉపయోగపడేలాగా చేస్తారు.. దయచేసి వనస్థలిపురం డి మార్ట్ వెనుక గల రెడీ టు సర్వ్ ఫ్రీ ఓల్డ్ ఏజ్ హోమ్ ని సంప్రదించగలరని ఆయన సూచించారు..
ఈ కార్యక్రమంలో రెడీ టు సర్వ్ ఫౌండేషన్ ఛైర్మెన్ పెద్ద శంకర్, సామాజికవేత్త సొంటి చంద్రశేఖర్ రెడ్డి, యువత కమిటి అధ్యక్షులు శివ నేత, బతుకమ్మ ఫేమ్ హీరో విజయ్ భాస్కర్, భాస్కర్ సాగర్, సంపత్, బ్లడ్ డోనర్, నాగమోహన్, శ్రీదేవి, చేపూరి శంకర్, గద్దె విజయనేత, ప్రకాష్, విక్రమ్, గణేష్, వినోద్ మామ, చరణ్, నవీన్, లింగ, దత్త, సూర్య, రవితేజ, మహేష్, శైలజ, విజయలక్ష్మి, వరలక్ష్మి, ఉమా, హసీనా, అరుంధతి మొదలగు వారు పాల్గొన్నారు..