గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి ఆదేశం
ఎల్బీనగర్:
గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ కూరగాయల మార్కెట్ లో చెత్త పేరుకుపోయినట్లు రైతులు, వ్యాపారులు సమాచారం అందించగా చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి వెంటనే స్పందించి పాలకవర్గం సభ్యులకు,అధికారులకు ఆదేశాలు జారీ చేసి పూర్తి స్థాయిలో క్లీన్ చేయించడం జరిగింది.మార్కెట్ ను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచడమే కాకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మార్కెట్ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి తెలిపారు.


