Tuesday, July 28, 2026
Google search engine
Homeతెలంగాణ*ఒక్కరోజు కమిషనర్.. నెరవేరిన దివ్యాంగ బాలుడి కల!

*ఒక్కరోజు కమిషనర్.. నెరవేరిన దివ్యాంగ బాలుడి కల!

మల్కాజిగిరి పోలీసుల మానవీయత.. కుర్చీలో కూర్చోబెట్టి గౌరవించిన సుమతి బడుగుల

మల్కాజిగిరి:

లక్ష్యానికి వైకల్యం అడ్డుకాదని, మనసుంటే మార్గం ఉంటుందని మల్కాజిగిరి పోలీసులు నిరూపించారు. పుట్టుకతోనే దివ్యాంగుడైన రాహుల్ అనే బాలుడి చిరకాల స్వప్నాన్ని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి బడుగుల సాకారం చేశారు. సమాజ రక్షణలో నిరంతరం బిజీగా ఉండే అధికారులు.. తమలోని మానవతా దృక్పథాన్ని చాటుకుంటూ ఆ బాలుడికి మరువలేని తీపి జ్ఞాపకాన్ని అందించారు.

*ఆశయం ముందు ఓడిన వైకల్యం
రాహుల్‌కు చిన్ననాటి నుంచే పోలీస్ అధికారి కావాలనేది ఆశయం. శారీరక వైకల్యం ఉన్నప్పటికీ, ఖాకీ డ్రెస్ వేసుకుని పోలీస్ అధికారి కుర్చీలో కూర్చోవాలని కలలు కనేవాడు. ఈ విషయం తెలుసుకున్న మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి బడుగుల వెంటనే స్పందించారు.

*ఘనంగా స్వాగతం.. క్యాప్ తొడిగి సత్కారం
బాలుడిని ప్రత్యేకంగా మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ ప్రధాన కార్యాలయానికి ఆహ్వానించారు. కమిషనర్ తన అధికారిక కుర్చీలో రాహుల్‌ను కూర్చోబెట్టి, పోలీస్ క్యాప్ (తొపీ) ధరింపజేశారు. ఆత్మీయంగా పలకరిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. తన జీవితకాల స్వప్నం సాకారమవ్వడంతో ఆ బాలుడి ముఖంలో వ్యక్తమైన చిరునవ్వు, ఆనందబాష్పాలు అక్కడున్న ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించాయి.

*”కర్తవ్య నిర్వహణలోనే కాదు.. సమాజం పట్ల మానవత్వం చూపడంలోనూ మల్కాజిగిరి పోలీసులు ఎల్లప్పుడూ ముందుంటారు.”

శాంతిభద్రతల పరిరక్షణతో పాటు సామాజిక బాధ్యతను నెరవేర్చడంలో మల్కాజిగిరి పోలీస్ యంత్రాంగం చూపిన ఈ నిబద్ధతపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments