*చట్టాన్ని ఉల్లంఘిస్తే ప్రజాస్వామ్యానికి ముప్పు
హైదరాబాద్:
న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు
రాష్ట్ర రాజధానిలో సంచలనం సృష్టిస్తున్న హైడ్రా వ్యవహారంలో ఉన్నత న్యాయస్థానం సంచలన నిర్ణయం తీసుకుంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను తక్షణమే ఆ పదవి నుంచి తప్పించి, మరో శాఖకు బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని (చీఫ్ సెక్రటరీ) హైకోర్టు ఆదేశించింది. శాంతాశ్రీరామ్ కన్‌స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించిన వివాదంలో కోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ, వివాదాస్పద ఆస్తిలోకి యంత్రాలు మరియు సిబ్బందితో బలవంతంగా ప్రవేశించడం పూర్తిగా చట్టవిరుద్ధమని న్యాయస్థానం స్పష్టం చేసింది.
*చట్టబద్ధ పాలనే ముఖ్యం
వ్యక్తుల ఆధిపత్యం పెరిగితే అది ప్రజాస్వామ్యానికి మరణశాసనం అవుతుందని హైకోర్టు తీవ్రస్థాయిలో హెచ్చరించింది. పాలన ఎప్పుడూ చట్ట పరిధిలోనే కొనసాగాలని, న్యాయస్థానాల ఆదేశాలను ధిక్కరించే అధికారాలు ఎవరికీ లేవని తేల్చిచెప్పింది. తక్షణమే రంగనాథ్ స్థానంలో మరో అధికారిని హైడ్రా కమిషనర్‌గా నియమించాలని సీఎస్‌ను ఆదేశిస్తూ ఉన్నత న్యాయస్థానం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.



