Thursday, August 6, 2026
Google search engine
Homeతెలంగాణకర్మన్‌ఘాట్‌లో బరితెగింపు.. రోడ్డు మీదే అక్రమ లిఫ్ట్ నిర్మాణం!

కర్మన్‌ఘాట్‌లో బరితెగింపు.. రోడ్డు మీదే అక్రమ లిఫ్ట్ నిర్మాణం!

నిబంధనలకు తిలోదకాలు.. ప్రశ్నిస్తే భయబ్రాంతులకు గురిచేస్తున్న అక్రమ నిర్మాణం

ఎల్బీనగర్:

హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాల పర్వం అడ్డూఅూపు లేకుండా సాగుతోంది. నిబంధనలను తుంగలో తొక్కి, ఏకంగా ప్రజా రవాణాకు ఆటంకం కలిగిస్తూ రోడ్డుపైనే లిఫ్ట్ నిర్మాణాలు చేపడుతున్న వైనం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. సెట్‌బ్యాక్ నిబంధనలను గాలికొదిలేసి, అగ్నిమాపక భద్రతా ప్రమాణాలను విస్మరించి చేపడుతున్న ఈ అక్రమ నిర్మాణంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వివరాల్లోకి వెళితే…
ఎల్బీనగర్ సర్కిల్ పరిధిలోని కర్మన్‌ఘాట్, రోడ్డు నంబర్ 02, నిర్మల్ నగర్ కాలనీలో (హెచ్.నెం: 8-1-59/34, ప్లాట్ నెం: 34) ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా లిఫ్ట్ నిర్మాణం జరుగుతోంది. మున్సిపల్ నిబంధనల ప్రకారం భవన నిర్మాణ సమయంలో వదలాల్సిన సెట్‌బ్యాక్‌ను పూర్తిగా ఆక్రమించడమే కాకుండా, ఏకంగా ఫుట్‌పాత్ స్థలాన్ని మరియు రోడ్డును ఆక్రమించి ఈ నిర్మాణం చేపడుతున్నారు.

  • నిబంధనలకు పాతర: మున్సిపల్ మరియు ఫైర్ సేఫ్టీ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించి ఈ నిర్మాణం సాగుతున్నా సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
  • ప్రమాదపు అంచున స్థానికులు: అత్యవసర సమయాల్లో అగ్నిమాపక వాహనాలు లేదా అంబులెన్సులు వెళ్లేందుకు కూడా వీలులేని విధంగా రోడ్డును కుదించి ఈ లిఫ్ట్ వేస్తుండటంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
    అధికారుల ఉదాసీనతపై మండిపాటు
    ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ అక్రమ నిర్మాణంపై స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఎల్బీనగర్ జోన్ అధికారులు, టౌన్ ప్లానింగ్ విభాగం తక్షణమే స్పందించాలని కోరుతున్నారు.

స్పందించాల్సిన అధికారులు:

  • మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్
  • ఎల్బీనగర్ జోన్ అధికారులు
  • ఎల్బీనగర్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు
  • ఏసీపీ అంబికా
  • టీపీఎస్ అర్చన
    ప్రజా భద్రతను ప్రమాదంలోకి నెడుతున్న ఈ అక్రమ లిఫ్ట్ నిర్మాణాన్ని తక్షణమే కూల్చివేయాలని, బాధ్యులైన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు, కాలనీవాసులు ఈ వార్త ద్వారా తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments