Monday, August 10, 2026
Google search engine
Homeతెలంగాణఅక్రమ నిర్మాణాలకు అధికారుల అండదండలు:

అక్రమ నిర్మాణాలకు అధికారుల అండదండలు:

  • ఎం.ఎం.సీ అధికారుల అవినీతి బాగోతంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
  • రెండు అంతస్తుల అనుమతులతో… ఐదు అంచెల అక్రమ నిర్మాణం!
  • రూ.లక్షలు చేరుతులు మారుతున్నాయి … మున్సిపల్ ఖజానాకు తూట్లు.
  • ఫిర్యాదులను ‘ఆదాయ వనరు’గా మార్చుకున్న ఎల్‌.బి.నగర్ సర్కిల్-13 టౌన్ ప్లానింగ్ అధికారులు.
  • *టి.పి.ఎస్ సాయి అర్చన ప్రొహిబిషన్ టైం లోనే చాకచక్యాన్ని ప్రదర్శిస్తున్న వైనం..
  • న్యాయస్థానం జోక్యంతో ఎట్టకేలకు విచారణకు ఆదేశం.

ఎల్బీనగర్:

సరూర్‌నగర్ మండలం, కర్మన్‌ఘాట్ పరిధిలోని హనుమాన్ నగర్‌లో వెలసిన ఒక అక్రమ భవన నిర్మాణంపై వెలువడిన హైకోర్టు తీర్పు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి)లోని టౌన్ ప్లానింగ్ విభాగం బరితెగింపునకు అద్దం పడుతోంది. కేవలం రెండు అంతస్తుల నిర్మాణానికి మాత్రమే అనుమతి పొంది, నిబంధనలను తుంగలో తొక్కి ఏకంగా ఐదు అంతస్తులు నిర్మిస్తున్నా సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.
భారీ ముడుపులకు అలవాటుపడిన అధికారులు, ప్రజాధనాన్ని కొల్లగొడుతూ అక్రమ నిర్మాణదారులకు రక్షణ కవచంలా మారుతున్నారన్న ఆరోపణలు నగరంలో తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి.

*నిబంధనలకు పాతర.. అక్రమార్కులకు రెడ్ కార్పెట్
రంగారెడ్డి జిల్లా, బాలాపూర్ పరిధిలోని హనుమాన్ నగర్, ప్లాట్ నెం. 78 లో స్టిల్ట్ మరియు రెండు అంతస్తుల నివాస భవన నిర్మాణానికే జీహెచ్ఎంసి నుంచి అనుమతి లభించింది. అయితే, నిబంధనలను ఉల్లంఘించిన యజమాని, స్టిల్ట్ భాగాన్ని వాణిజ్య దుకాణాలుగా (ముల్గీలుగా) మార్చడమే కాకుండా, అనుమతులు లేని అదనపు అంతస్తులను నిర్మించారు.
ఈ దారుణమైన ఉల్లంఘనలపై స్థానికులు మరియు బాధితులు ఎల్‌.బి.నగర్ సర్కిల్-13 టౌన్ ప్లానింగ్ అధికారులకు పదుల సంఖ్యలో లిఖితపూర్వక ఫిర్యాదులు చేశారు. కానీ, క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఆ ఫిర్యాదులనే తమకు అనుకూలమైన ‘ఆదాయ మార్గాలుగా’ మలచుకున్నారు.

*అధికారుల అలసత్వం.. లంచాల మాయాజాలం

  • లక్షల్లో ముడుపులు: అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారులు భారీ మొత్తంలో లంచాలు స్వీకరించి, ఆ నిర్మాణాల వైపు కన్నెత్తి చూడకుండా మౌనం వహిస్తున్నారన్న విమర్శలున్నాయి.

*టి.పి.ఎస్ సాయి అర్చన ప్రొహిబిషన్ టైం లోనే చాకచక్యాన్ని ప్రదర్శిస్తున్న వైనం: ఈ టౌన్ ప్లానింగ్ అధికారిని ఆమెకు నచ్చితే ఒక లెక్క నచ్చకుంటే మరో లెక్క.. వాణిజ్య స్థలానికి రెసిడెన్షియల్ అనుమతులు ఇవ్వడం, ఒకే ప్లాటుకు రెండు జీరో పర్మిషన్లు ఇచ్చి, మార్ట్ గేజ్ ఎగ వేయించి, అక్రమ సేలార్లకు అక్రమ నిర్మాణాలకు భారీ ముడుపులు తీసుకొని సొంత నిర్ణయాలతో అఫిడవిట్ నోట్ రాయించుకొని సక్రమం చేయడం, ఈ విధంగా మున్సిపల్ సంస్థకు లక్షల్లో పన్ను ఎగ వేయించి, సొంత జేబులు నింపుకుంటున్న వైనం.. పదుల సంఖ్యలో శాస్త్రీయమైన ఆధారాలు ఉన్నాయి: ఈ విషయంపై ఉన్నతాధికారులైన ఎస్.టి.ఎఫ్.టీం ఇన్చార్జ్ అధికారులకు ఫిర్యాదు, ఈ అవినీతి పై ఉన్నత స్థాయి అధికారులు చర్యలు తీసుకోక పోవడం వెనుక అంతర్యం ఏమిటో మహిళా, అనే సానుభూతా.. లేక అమాయకపు నటననా…!, ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకొని న్యాయంగా ఉద్యోగం చేయవలసిన అధికారి, అవినీతి అక్రమార్జున వైపు పనిచేస్తే, రూల్స్ ఏం చేస్తున్నాయి,…! ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ వికాస్ మహతో ఐఏఎస్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి ఐఏఎస్ దృష్టి సారించాలి అంటూ స్థానికుల డిమాండ్..

  • పెనాల్టీల పేరిట కాలయాపన: తదుపరి దశలో డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారులు నామమాత్రపు జరిమానాలు (పెనాల్టీలు) విధించి, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఆ అక్రమ నిర్మాణాలను సక్రమం (కంపౌండింగ్) చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
  • ఖజానాకు గండి: ఈ అనధికారిక తంతు కారణంగా ప్రభుత్వ ఖజానాకు చేరవలసిన లక్షలాది రూపాయల రుసుములు అధికారుల వ్యక్తిగత జేబుల్లోకి మరులవుతున్నాయి.
  • ప్రజాజీవనానికి ముప్పు: రోడ్లు, ఫుట్‌పాత్‌లు ఆక్రమణకు గురవుతుండటంతో పాటు, ఫైర్ సేఫ్టీ (అగ్నిమాపక భద్రతా) నిబంధనలు పూర్తిగా గాలికి కొట్టుకుపోతున్నాయి. దీనివల్ల చుట్టుపక్కల నివసించే సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

*న్యాయస్థానం గట్టి హెచ్చరిక:
రిట్ పిటిషన్ నెం. 14384 ఆఫ్ 2026 తీర్పు తేది: 01.05.2026

అధికారుల ఈ నిర్లక్ష్య వైఖరిపై విసిగిపోయిన బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, ఈ వ్యవహారంపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం అధికారుల తీరును తీవ్రంగా తప్పుబట్టింది. టీజీ-బాస్‌ (TG-bPASS) చట్టం-2020 సెక్షన్ 7(6) మరియు జీహెచ్ఎంసి చట్టం-1955 లోని వివిధ సెక్షన్లు స్పష్టమైన అధికారాలు కల్పించినప్పటికీ, క్షేత్రస్థాయిలో అధికారులు వాటిని అమలు చేయడంలో విఫలమవుతున్నారని న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఫిర్యాదు అందిన వారం రోజుల్లోగా విచారించి తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందని గుర్తుచేసింది. బాధ్యులైన టౌన్ ప్లానింగ్ అధికారులు వెంటనే స్పందించి, సంబంధిత అక్రమ నిర్మాణాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని న్యాయస్థానం హెచ్చరించింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments