పటాన్చెరు
పటాన్చెరు శాంతినగర్‌లోని మెథడిస్ట్ చర్చ్‌లో పటాన్చెరు నియోజకవర్గ క్రిస్టియన్ లీగల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన “Spiritual & Awareness Meeting” కార్యక్రమంలో మాద్రి పృథ్వీరాజ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్వహించిన రాజ్యాంగ అవగాహన సదస్సులో పాల్గొని, ప్రతి పౌరుడు రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలు మరియు చట్టాలపై అవగాహన కలిగి ఉండాల్సిన అవసరాన్ని వివరించారు.
ఆధ్యాత్మికతతో పాటు రాజ్యాంగ విలువలు, చట్టపరమైన అవగాహన, సామాజిక బాధ్యతపై ప్రజల్లో చైతన్యం పెంపొందించే ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని తెలిపారు.


