- పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి..
- పటాన్‌చెరులో ఘనంగా బోనాల పండుగ..
పటాన్‌చెరు:
ఆషాఢ మాసం బోనాల పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని సోమవారం ఉదయం పటాన్‌చెరు పట్టణంలోని వివిధ కాలనీలలో గల అమ్మవారి దేవాలయాలు, గ్రామ దేవతల ఆలయాలను పటాన్చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అమ్మవారి కృపతో పటాన్‌చెరు నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, ప్రతి కుటుంబంలో ఆనందం, శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆకాంక్షించారు.
ఆషాఢ మాస బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని, తరతరాలుగా కొనసాగుతున్న ఈ ఆధ్యాత్మిక వేడుకలను ప్రజలంతా భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో నిర్వహించుకోవాలని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా ఆయా ఆలయాల నిర్వాహకులు, మాజీ ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యే కి ఘన స్వాగతం పలికి, శాలువాలతో సత్కరించారు. పండుగ సందర్భంగా కాలనీల్లో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.


