Tuesday, August 11, 2026
Google search engine
Homeతెలంగాణజైల్ భరో కార్యక్రమాన్ని నిర్వహించిన కామ్రేడ్స్

జైల్ భరో కార్యక్రమాన్ని నిర్వహించిన కామ్రేడ్స్

ఎల్బీనగర్:

క్విట్ ఇండియా స్పూర్తితో ఎల్బీనగర్ చౌరస్తాలో సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం మరియు రైతు సంఘం ఆధ్వర్యంలో జైల్ భరో కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. సిఐటియు రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. చంద్రమోహన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ సీతారాములు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వము 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చిందని, ఈ నాలుగు లేబర్ కోడ్లు అమలయితే 12 గంటల పని విధానం వస్తుందని, ఉద్యోగులకు సామాజిక భద్రత లేకుండా పోతుందని, సమ్మె చేసే హక్కులు కోల్పోతామని, సంఘం ఏర్పాటు చేయాలంటే కఠినమైన నిబంధనలు విధిస్తున్నారని, ఎలాంటి నోటీసులు లేకుండానే కార్మికులను తొలగించే విధానం తీసుకొస్తున్నారని వీటికి వ్యతిరేకంగా కార్మికులు ప్రజలంతా ఉద్యమించాలని ఆయన కోరారు. అదేవిధంగా జీరో దిగుమతులతో భారత రైతాంగం దెబ్బతినే విధంగా అమెరికా ఆంక్షలతో మన వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్ తగ్గే విధంగా నూతన చట్టాలను తీసుకువస్తున్నారని, నూతన విద్యుత్ విధానము అమలు జరిగితే స్మార్ట్ మీటర్లు వస్తాయని విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెరిగి ప్రజలపై భారాలు విపరీతంగా పెరుగుతాయని, జీరో బిల్లు రద్దు అవుతుందని ఆయన తెలిపారు. ఉపాధి హామీ చట్టంలో కేంద్ర ప్రభుత్వం మార్పులు తీసుకువచ్చి వీబీజీ రాంజీ చట్టంగా మార్చిందని దీనిలో రాష్ట్ర ప్రభుత్వం 40% భరించాలని షరతు పెడుతుందని దీనివల్ల గ్రామాల్లో ఉపాధి పోతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని ఉపన్యాసం చేసిన వారు సిఐటియు రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు డి. జగదీష్ ఎస్. రామ్మోహన్ ఎం. వీరయ్య లోతోపాటు సహాయ కార్యదర్శిలు ఏ. దేవేందర్,ఆలేటి ఎల్లయ్య జిల్లా కమిటీ సభ్యులు సిహెచ్ కృష్ణయ్య, శేఖర్ యాదవ్, బిసీ డబ్ల్యూయూ జిల్లా అధ్యక్షుడు బి చైతన్య, నాయకులు పార్వతి బి స్వామి వెంకటయ్య స్వప్న కవిత, లతీఫ్, పరశురాములు, ట్రాన్స్పోర్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఎం నరహరి రాష్ట్ర కమిటీ సభ్యుడు కే రాములు, ఈ పోరాటానికి మద్దతుగా వచ్చిన సిపియం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కేసరి నర్సిరెడ్డి, మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు గోరింకల నరసింహ, జిల్లా నాయకులు సిహెచ్ వెంకన్న, కృష్ణమూర్తి, విశ్వకర్మ వృత్తిదారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు యాదగిరి చారి, పార్టీ నాయకులు కొత్త గణేష్ గౌడ్, ఐద్వా రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు సంధ్య, కేవీపిఎస్ నాయకులు బి. కనకయ్య, వివిధ సంఘాల నాయకులు శ్రీనివాస్, బిక్షపతి, సత్యనారాయణ, కాశయ్య, సుమన్, రాధమ్మ, అలివేలు, సైదమ్మ, ఎల్లమ్మ,అరుణ, రేణుక, కలమ్మ, వెంకటమ్మ, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments