సరూర్ నగర్ కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధుల అల్టిమేట్
ఎల్బీనగర్:
సరూర్నగర్ డివిజన్ సమస్యల మీద ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ ను కలిసిన సరూర్నగర్ డివిజన్ కాలనీ సంక్షేమ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ బేర బాలకిషన్, డాక్టర్స్ కాలనీ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నల్లెంకి ధనరాజ్ గౌడ్, సరూర్నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు తాండ్ర భాస్కర్, ఎన్ఎస్యుఐ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు చింతకింది రంజిత్, డాక్టర్స్ కాలనీ డివిజన్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ ఇమ్రాన్ అలీ.ఈ సందర్భంగా వారు జోనల్ కమిషనర్ వికాస్ మహాతో సరూర్నగర్ సర్కిల్ డిప్యూటి కమీషనర్ శ్రీకాంత్ లకు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, సరూర్నగర్ వార్డు కార్యాలయాన్ని షెల్టర్ ఫర్ అర్బన్ హోమ్ లెస్ నిర్వహణ కోసం ఒక స్వచ్ఛంద సంస్థకు అప్పజెప్పాలని కొందరు అధికారులు ప్రయత్నాలు చేయడం వెంటనే మానుకోవాలని,సరూర్నగర్ వార్డు కార్యాలయం డివిజన్లోని అనేక కాలనీల ప్రజలకు సమస్యలు చెప్పుకోవడానికి, ముఖ్యంగా పారిశుద్ధ పనులు నిర్వహణ కోసం, వాటర్ వర్క్స్ మరియు సివరేజ్, మున్సిపల్ టాక్స్ కట్టడానికి కమిషనర్ స్థాయీ అధికారి, బిల్ కలెక్టర్లు, టిఐలు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది వార్డు కార్యాలయంలో ఉండడం వల్ల డివిజన్ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని,ఇంత చక్కటి సేవలకు ఎంతో అనువుగా ఉన్న వార్డు కార్యాలయాన్ని వేరే సంస్థకు అప్పజెప్పాలని చూడడం వెంటనే మానుకోవాలని సరూర్నగర్ డివిజన్ కాలనీ సంక్షేమ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ బేర బాలకిషన్ ఎల్బీనగర్ జోనల్ కమిషనర్, సరూర్నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ల ముందు గట్టిగా తమ వాదనలను వినిపించారు. వార్డు కార్యాలయమును ఎట్టి పరిస్థితుల్లో ఇతరులకు అప్పగిస్తే, ఆ తరువాత తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, అధికారులు తమ వైఖరిని మార్చుకోవాలని, లేకపోతే ప్రజాగ్రహానికి గురికావాల్సి వస్తుందని, వేలాది మందితో వార్డు కార్యాలయం ముందు సత్యాగ్రహం చేపడతామని బాలకిషన్ హెచ్చరించారు.


