Home తెలంగాణ ఇంజనీరింగ్ కాలేజీల్లో బయోమెట్రిక్ బూటకం..

ఇంజనీరింగ్ కాలేజీల్లో బయోమెట్రిక్ బూటకం..

0
1
  • ఫేషియల్ రికగ్నిషన్ అమలు చేయడంలో ప్రభుత్వ మీనమేషాలు!
  • విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం.. సిలికాన్ వేళ్లతో సాగుతున్న దగా
  • క్యాడర్ రేషియో గాలికి.. నిరుద్యోగ అధ్యాపకులకు అందని ఉద్యోగ అవకాశాలు

హైదరాబాద్:

తెలంగాణ రాష్ట్రంలోని సాంకేతిక కళాశాలలో విద్యా ప్రమాణాలు రోజురోజుకూ దిగజారిపోతున్నాయి. ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, మరియు ఎంసీఏ వంటి ఉన్నత విద్యా సంస్థలలో నాణ్యమైన విద్యను అందించాల్సిన అధ్యాపకులు నామమాత్రంగా మారిపోయారు. గత సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ఫ్యాకల్టీ హాజరు కోసం బయోమెట్రిక్ విధానాన్ని రద్దు చేసి, అత్యాధునిక ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ సిస్టమ్ ను తప్పనిసరిగా అమలు చేయాలని స్పష్టమైన సర్కార్ సర్క్యులర్ జారీ చేసింది. కానీ, ఆచరణలో మాత్రం ఈ ఆదేశాలు బుట్టదాఖలయ్యాయి.
క్షేత్రస్థాయిలో బయోమెట్రిక్ హాజరు పేరిట పెద్ద ఎత్తున మోసాలు జరుగుతున్నాయి. పలు కళాశాలల్లో సిలికాన్ వేలిముద్రలను (సిలికాన్ థంబ్స్) ఉపయోగించి నకిలీ హాజరు నమోదు చేస్తుండగా, మరికొన్ని చోట్లలో ఉదయం, సాయంత్రం వేళల్లో కేవలం హాజరై సంతకాలు పెట్టి వెళ్లిపోతున్న వైనం స్పష్టమవుతోంది. ఈ తంతు వల్ల తరగతి గదుల్లో నిపుణులైన అధ్యాపకుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఫలితంగా ఇంజనీరింగ్, ఇతర సాంకేతిక కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య మరుగవుతోంది.

*క్యాడర్ రేషియో అమలు ఏది?
సాంకేతిక విద్యా మండలి నిబంధనల ప్రకారం కళాశాలల్లో తగిన నిష్పత్తిలో క్యాడర్ రేషియో (ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు) కచ్చితంగా అమలు కావాలి. అయితే, యాజమాన్యాలు నిబంధనలను తుంగలో తొక్కి నామమాత్రపు సిబ్బందితో కాలం వెళ్లదీస్తున్నాయి. దీనివల్ల వేలాది మంది అర్హులైన నిరుద్యోగ అధ్యాపకులు ఉద్యోగావకాశాలు కోల్పోయి రోడ్డున పడుతున్నారు.

*తక్షణమే స్పందించాలి
ప్రభుత్వం ఇప్పటికైనా జోక్యం చేసుకుని, కేవలం సర్క్యులర్లకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పకడ్బందీగా ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ సిస్టమ్ ను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. తద్వారా నకిలీ హాజరు దందాలకు అడ్డుకట్ట పడుతుంది. అదేవిధంగా క్యాడర్ రేషియో అమలును కఠినతరం చేసి, అర్హులైన నిరుద్యోగ అధ్యాపకులకు ఉద్యోగ కల్పన జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.
అయినేని.సంతోష్ కుమార్, రాష్ట్ర అధ్యక్షులు, టి.ఎస్.టి.సి.ఈ.ఎ (తెలంగాణ స్కూల్స్, టెక్నికల్ కాలేజెస్ ఎంప్లాయిస్ అసోసియేషన్)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here