ఎల్బీనగర
శ్రావణ శుక్రవారం సందర్భంగా బీజేపీ రంగారెడ్డి (అర్బన్) జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి నందికొండ గీతారెడ్డి ఆధ్వర్యంలో వారి నివాసంలో నిర్వహించిన వరలక్ష్మీ వ్రత పూజా కార్యక్రమంలో బద్దం సృజన ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. అనంతరం పూజా కార్యక్రమానికి హాజరైన ఆడబిడ్డలకు వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతం నిర్వహించడం మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని బద్దం సృజన ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.


