Tuesday, September 22, 2026
Google search engine
Homeతెలంగాణఖనిజ సంపద దోపిడీకి అడ్డుకట్ట వేయండి!

ఖనిజ సంపద దోపిడీకి అడ్డుకట్ట వేయండి!

  • గనుల శాఖపై సీఎస్ సంజయ్ జాజు ఉక్కుపాదం
  • అక్రమార్కుల భరతం పట్టాలని అధికారులకు స్పష్టమైన హెచ్చరిక.

హైదరాబాద్:

రాష్ట్రంలో ప్రజాధనాన్ని కొల్లగొడుతున్న భూచోరులపై ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి కఠిన ఆదేశాల మేరకు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు సోమవారం డా.బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో గనులు, భూగర్భ వనరుల శాఖపై జరిపిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఇసుక మాఫియా, ఖనిజ సంపద అక్రమ రవాణాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆదాయాన్ని కొల్లగొడుతున్న అసాంఘిక శక్తులపై నిరంతర దాడులు నిర్వహించి, కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

*అక్రమ తవ్వకాలపై విజిలెన్స్ కొరడా
రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న అక్రమ ఇసుక రవాణా, అనధికారిక ఖనిజ తవ్వకాలను ఉపేక్షించే ప్రసక్తే లేదని సీఎస్ శ్రీ సంజయ్ జాజు తేల్చిచెప్పారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడే ప్రాంతాలను ఏరివేయాలని, విజిలెన్స్ బృందాలను రంగంలోకి దించి ముమ్మర ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని స్పష్టం చేశారు. అక్రమ రవాణాపై అందిన ప్రతి ఫిర్యాదుపై తక్షణమే స్పందించి, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

*ప్రభుత్వ ఖజానాకు గండి కొడితే ఉపేక్షించేది లేదు
ఖనిజ వనరుల పారదర్శక వినియోగం ద్వారా రాష్ట్ర రాజసానిని, ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయాలని సీఎస్ శ్రీ సంజయ్ జాజు ఉద్ఘాటించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిగా జోడించి పర్యవేక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు. శాఖలో నెలకొన్న సిబ్బంది కొరతను నివారించేందుకు పెండింగ్‌లో ఉన్న నియామకాలు, పదోన్నతుల ప్రక్రియను తక్షణమే వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.

ఈ కీలక సమీక్షా సమావేశంలో మైన్స్ అండ్ జియాలజీ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్ డి.ఎస్. చౌహాన్, ఐటీఈఅండ్‌సీ సంయుక్త కార్యదర్శి, మైన్స్ డైరెక్టర్ అనుదీప్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments