Wednesday, September 23, 2026
Google search engine
Homeతెలంగాణదళారుల దందాకు పారిశుద్ధ్య కార్మికులే బలి!

దళారుల దందాకు పారిశుద్ధ్య కార్మికులే బలి!

  • రెండు గంటలు విధులకు ఆటంకం..అనారోగ్యం బారిన మహిళా కార్మికులు
  • దళారుల ప్రయోజనాలా.. కార్మికుల ఆరోగ్యమా? అధికారులే తేల్చాలి!

ఎల్బీనగర్:

సరూర్ నగర్ స్టేడియం సమీపంలోని సర్వీస్ రోడ్డులో కూరగాయల మార్కెట్‌ నిర్వహణ పేరుతో దళారుల వ్యవహారాలు హద్దు పద్దు లేకుండా కొనసాగుతుండటంతో 21 మంది పారిశుద్ధ్య కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపిస్తున్నారు. దళారుల కూరగాయల మార్కెట్‌ కారణంగా ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం సుమారు రెండు గంటల పాటు వీధులను, పడేసిన కూరగాయల ఆకులను శుభ్రం చేయలేని పరిస్థితి నెలకొంటోందని చెబుతున్నారు. దీంతో చెత్తాచెదారం పేరుకుపోవడంతో పాటు దుమ్ము, దుర్వాసన మధ్య విధులు నిర్వహించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రజల ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తెల్లవారుజాము నుంచే రోడ్లు, వీధులను శుభ్రం చేస్తున్న కార్మికుల ఆరోగ్యం కోసం మాత్రం పట్టించుకునే నాథుడే లేరని వారు వాపోతున్నారు. కూరగాయల మార్కెట్‌ వల్ల విధులకు ఆటంకం కలుగుతున్న విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం లేదని ఆరోపిస్తున్నారు.దళారుల సౌకర్యాల కోసం పారిశుద్ధ్య కార్మికులను ఇబ్బందులకు గురిచేయడం ఎంతవరకు సమంజసమని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. మల్కాజిగిరి మున్సిపల్‌ కమిషనరేట్ అధికారులు వెంటనే స్పందించి మార్కెట్‌ నిర్వహణకు, పారిశుద్ధ్య పనులకు మధ్య సమన్వయం కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఏడాదికోసారి గ్రూపుల మార్పును కోరుతున్న కార్మికులు

పారిశుద్ధ్య కార్మికులకు పని ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు తగ్గించేందుకు ఏడాదికోసారి గ్రూపులను మార్చే విధానాన్ని అమలు చేయాలని కార్మికులు కోరుతున్నారు. ఒక గ్రూపు ఏడాది పాటు ఈ మార్కెట్ ప్రాంతంలో విధులు నిర్వహించిన అనంతరం మరో గ్రూపుకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విధానం వల్ల అన్ని గ్రూపులకు సమానంగా పని అవకాశం లభించడంతో పాటు, ఒకే ప్రాంతంలో నిరంతరం ఎదురవుతున్న సమస్యల నుండి రోగాల బారిన పడకుండా ఉంటామని ప్రాధేయ పడుతున్నారు.ఇకనైనా ఎంఎంసి అధికారులు కళ్లు తెరిచి, దళారుల ప్రయోజనాల కంటే పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యం, ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని కార్మికులు కోరుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments