ఎల్బీనగర్:
భక్తి,భద్రత,బాధ్యతతో గణనాథుడి నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు.
గురువారం సరూర్నగర్ కట్ట వద్ద జరగనున్న గణేష్ నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి కొనసాగుతున్న ఏర్పాట్లు పనులను సుధీర్ రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు.నిమజ్జనానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలు,ట్రాఫిక్ నియంత్రణ,పార్కింగ్,తాగునీరు,విద్యుత్,పారిశుద్ధ్యం తదితర ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.నిమజ్జన ప్రక్రియ సజావుగా, ప్రశాంతంగా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. గణనాథుడి నిమజ్జనానికి వచ్చే భక్తులు అధికారులకు సహకరిస్తూ భక్తి,భద్రత, బాధ్యతతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ బోనగిరి శ్రీనివాస్, ఈఈ.కార్తీక్ భారాస నాయకులు గండికోట శ్రీనాథ్,కోమల్ తదితరులు పాల్గొన్నారు.


