పారిశుద్ధ్య కార్మికుల సేవలు అభినందనీయం – బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి..
ఎల్బీనగర్:
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా ఆదివారం సరూర్‌నగర్‌లోని శంకేశ్వర్ బజార్ శ్రీ భవానీ శంకర్ ఆలయం వద్ద బీజేపీ సీనియర్ నాయకులు గార్లపాటి జితేందర్, రమేష్ గుప్తా ఆధ్వర్యంలో జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు టిఫిన్ బాక్స్‌ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె. లక్ష్మణ్ హాజరుకాగా, స్థానిక గడ్డిఅన్నారం డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్, బీజేపీ నాయకులు బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కె. లక్ష్మణ్ ని శాలువాతో ఘనంగా సత్కరించారు, అనంతరం చేతుల మీదుగా పారిశుద్ధ్య కార్మికులకు టిఫిన్ బాక్స్‌లను పంపిణీ చేశారు. నగర పరిశుభ్రత కోసం నిరంతరం శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలను ఈ సందర్భంగా నాయకులు అభినందించారు.ఈ సందర్భంగా బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని, సేవాభావంతో సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేయడమే సేవా సంకల్ప్ అభియాన్ ముఖ్య ఉద్దేశమని అన్నారు.
ప్రజారోగ్యం, నగర పరిశుభ్రత కోసం ఎండ, వానలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని, వారి కృషిని గుర్తించి గౌరవించడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. సమాజానికి నిస్వార్థంగా సేవలందించే కార్మికులను గౌరవించుకోవడం ఎంతో సంతోషకరమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు చిలుకూరి రాంరెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు దాసరి మల్లేశం, సుభాష్ చంద్ర జీ, హైదరాబాద్ జిల్లా బీజేపీ నాయకులు నిరంజన్ యాదవ్, లింగాల హరిగౌడ్, ముసలాంబాగ్ డివిజన్ తాజా మాజీ బీజేపీ కార్పొరేటర్ మొక్క మధుసూదన్, భాగ్యలక్ష్మి, గడ్డిఅన్నారం డివిజన్ బీజేపీ అధ్యక్షులు దాసరి జయప్రకాష్, బద్దం వివేకానంద రెడ్డి, సిరి రెడ్డి, బాబు చౌదరి, సతీష్ చారి, చిలుకూరి మధుసూదన్ రెడ్డి, వంశీ యాదవ్, రఘునందన్ జోషి, గిరీష్ గౌడ్, శశాంక్ నాయుడు, హరీష్ తదితరులు పాల్గొన్నారు.



