ఎల్బీనగర్
చింతలకుంట జహంగీర్ నగర్ లో జరిగినటువంటి చైతన్య వికాస్ మహిళల పరస్పర సహాయ సహకార పరిమిత సంఘం ఆధ్వర్యంలో పేద మహిళల ఆర్థిక, సామాజిక సాధికారతే లక్ష్యంగా 2006లో కోనేరు సంస్థ సహకారంతో ప్రారంభమైన చైతన్య వికాస్ మహిళల పరస్పర సహాయ సహకార పొదుపు సంఘం రెండు దశాబ్దాలుగా సేవలందిస్తోంది. జహంగీర్ నగర్ చింతలకుంట పాత చెక్‌పోస్టు వద్ద ఉన్న ఈ సంఘంలో ప్రస్తుతం 3,000 మందికి పైగా సభ్యులున్నారు. సంస్థ అధ్యక్షుడు ఎం.ఏ. సలీం సూచనలు, సహకారంతో ఏర్పాటైన ఈ సంఘం మహిళల్లో పొదుపు అలవాటును పెంపొందిస్తూ, చిన్న వ్యాపారాలు, జీవనోపాధి కార్యకలాపాలకు రుణ సదుపాయం కల్పిస్తోంది. సభ్యులకు టైలరింగ్ శిక్షణ, పరస్పర బీమా ప్రయోజనాలను అందిస్తోంది. ఇప్పటివరకు సభ్యుల పొదుపు రూ.2.31 కోట్లకు పైగా చేరగా, పొదుపుపై వచ్చిన ఆదాయంగా రూ.1.05 కోట్లకు పైగా పంపిణీ చేసినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. రానున్న ఐదేళ్లలో సభ్యుల సంఖ్యను 5,000కు పెంచడంతోపాటు, మహిళలకు నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. సంఘం 20వ వార్షికోత్సవం సందర్భంగా మహిళా సభ్యులకు పొదుపు ప్రోత్సాహకంగా వన్‌గ్రామ్ బంగారు పథకం కింద వెండి నాణేలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎం ఏ సలీం డైరెక్టర్ కోనేరు సంస్థ చైతన్య వికాస్ డైరెక్టర్స్ శంషాద్ హజ్ర ఆశ రాధిక పద్మజ ప్రేమలత హేమలత తదితరులు పాల్గొన్నారు


