Wednesday, November 4, 2026
Google search engine
Homeతెలంగాణనిత్యావసర ధరల పెరుగుదలపై బీఆర్ఎస్ మహిళా విభాగం ధర్నా

నిత్యావసర ధరల పెరుగుదలపై బీఆర్ఎస్ మహిళా విభాగం ధర్నా

నిరసన కార్యక్రమంలో పాల్గొన్న దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

ఎల్బీనగర్

నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలపై పడుతున్న ఆర్థిక భారాన్ని నిరసిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఎల్బీనగర్ బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ మార్కెట్ నుంచి ఎల్బీనగర్ చౌరస్తా వరకు మౌన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ మహిళా నాయకులు 2023లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోని నిత్యావసర వస్తువుల ధరలను, 2026లో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోని ధరలతో పోలుస్తూ రూపొందించిన పట్టికను ప్రదర్శించారు. బియ్యం, వంట నూనె, గ్యాస్ సిలిండర్, పాలు, చక్కెర, కందిపప్పు, గుడ్లు, ఉల్లిపాయలు, టమోటాలు తదితర నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను ప్రజల దృష్టికి తీసుకెళ్లారు.రోజురోజుకూ పెరుగుతున్న ధరలతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాల నెలవారీ బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం పడుతోందని మహిళా విభాగం ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా కుటుంబ ఆర్థిక వ్యవహారాలను నిర్వహించే మహిళలు పెరుగుతున్న ధరల కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంది.ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయడంతో పాటు, నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.ప్రజలకు కావాల్సింది కేవలం హామీలు కాదు. మీ హాయంలో పెరుగుతున్న ధరల నుంచి ఉపశమనం కూడా అని బీఆర్ఎస్ మహిళా విభాగం స్పష్టం చేసింది.ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ నియోజకవర్గానికి చెందిన సీనియర్ మహిళా నాయకులు, బీఆర్ఎస్ మహిళా విభాగం ప్రతినిధులు మల్లీశ్వరి, రంగేశ్వరి నాయుడు, మాజీ కార్పొరేటర్ పద్మా నాయక్, శోభా రాణి మహిళా విభాగం కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments