Saturday, November 7, 2026
Google search engine
Homeతెలంగాణఫాక్స్ సాగర్ డైవర్షన్ నాలా కబ్జాకు యత్నం

ఫాక్స్ సాగర్ డైవర్షన్ నాలా కబ్జాకు యత్నం

  • మట్టిపోసిన వాహనాలను సీజ్ చేసిన హైడ్రా
  • వాహనాలతో పాటు యజమానులను పోలీసులకు అప్పగించిన హైడ్రా

హైదరాబాద్

ఫాక్స్ సాగర్ చెరువు పరిధిలోని డైవర్షన్ నాలా కబ్జా ప్రయత్నాలను హైడ్రా అడ్డుకుంది. మట్టి, నిర్మాణ వ్యర్థాలతో పూడ్చేసిన ప్రయత్నాలకు శుక్రవారం చెక్ పెట్టింది. సుభాష్ నగర్‌లోని ఫాక్స్ సాగర్ తూము వద్ద శుక్రవారం మధ్యాహ్నం కొందరు వ్యక్తులు జేసీబీ, టిప్పర్, ట్రాక్టర్ వాహనాలతో నాలా ప్రాంతంలో మట్టి, నిర్మాణ వ్యర్థాలను డంపింగ్ చేస్తున్నట్లు హైడ్రా అధికారులు గుర్తించారు. వెంటనే స్పందించిన హైడ్రా బృందం అక్రమ డంపింగ్‌ను అడ్డుకుని, ఈ కార్యకలాపాలకు ఉపయోగించిన జేసీబీ, టిప్పర్ (TS12UB6476), ట్రాక్టర్ (TS19TA1588)లను పట్టుకుంది. స్వాధీనం చేసుకున్న వాహనాలతో సహా వాటి యజమానులను పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. డైవర్షన్ కాలువలో వేసిన మట్టిని వెనువెంటనే తొలగించే పనులు కూడా హైడ్రా చేపట్టింది. మరో వైపు చెరువు పునరుద్ధరణలో భాగంగా చేరు FTL పరిధిలో వేసిన కట్టతో పాటు మరో వైపు ఫామ్ హౌజ్ కి వెళ్లేలా వేసిన సిమెంట్ రోడ్ ను కూడా హైడ్రా తొలగించింది.

పై వార్త వ్యాసానికి మరిన్ని హంగులు, శాస్త్రీయ ఆధారాలు జోడించి,
పద దోషాలు లేకుండా, గౌరవ పదాలు లేకుండా, ఆంగ్ల పదాలు లేకుండా, మంచి కూర్పుతో శీర్షిక సబ్ టైటిల్స్ తో వ్యాసంలో హెడ్డింగ్లు లేకుండా సూటి గా భారత శక్తి దిన పత్రిక శైలీ లో వార్త కథనాన్ని వ్రాసి పంపగలవు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments