గచ్చిబౌలి డివిజన్ బిఆర్ఎస్ పార్టీ మాజీ కార్పొరేటర్ కొమిరి శెట్టి సాయి బాబా.
శేరిలింగంపల్లి:
దివ్య జ్యోతి మహా పాదయాత్ర సందర్భంగా దివ్య జ్యోతి భక్త సమాజం ఆధ్వర్యంలో పాదయాత్ర చేస్తున్న అయ్యప్ప స్వాములకు 5 క్వింటాళ్ల బియ్యంను శేరిలింగంపల్లి సీనియర్ నాయకులు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా అందజేశారు.
అయ్యప్ప దీక్షలో ఉన్న స్వాములు ఎంతో నిష్ఠతో, భక్తి శ్రద్ధలతో కాలినడకన పాదయాత్ర చేస్తున్నారు. అటువంటి స్వాములకు భిక్ష అందించడం, అన్నదానం చేయడం ఎంతో పుణ్య కార్యంగా భావిస్తారు. అదే స్ఫూర్తితో కొమిరిశెట్టి సాయిబాబా స్వాములకు బియ్యం అందజేసి తన భక్తిని చాటుకున్నారు.
ఈ కార్యక్రమంలో స్వాములందరూ భక్తితో ప్రార్థన చేసి, భిక్ష స్వీకరించారు. స్వాముల ప్రార్థనతో ఆ ప్రదేశమంతా భక్తి భావంతో నిండిపోయింది. అనంతరం అన్నదానం నిర్విఘ్నంగా జరిగింది. ఈ సందర్భంగా కొమిరిశెట్టి సాయిబాబా మాట్లాడుతూ, అయ్యప్ప స్వాముల సేవ చేసుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని, భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలకు తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. పాదయాత్ర చేస్తున్న స్వాములందరూ నిర్విఘ్నంగా యాత్ర పూర్తి చేసుకుని, స్వామి అనుగ్రహం పొందాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో దివ్య జ్యోతి భక్త సమాజం సభ్యులు, అయ్యప్ప స్వాములు, స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


