మియాపూర్ ప్రభుత్వ భూములను అమ్మాలని చూస్తే ఊరుకోం…
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి రవికుమార్ యాదవ్.
శేరిలింగంపల్లి
మియాపూర్ సర్వే నంబర్లు 100, 101 లలోని 550 ఎకరాల భూమి ప్రభుత్వానిదే అని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ భూములను అమ్మాలని నిర్ణయించినట్లు ప్రకటించిన సందర్భంగా ఎం.ఏ. నగర్ కాలనీని క్షేత్రస్థాయిలో సందర్శించి అక్కడే నివాసం ఉంటూ వారి ఇల్లు కోల్పోతున్న బాధితులతో మాట్లాడి అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మియాపూర్ పరిధిలోని వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ మాఫియాకు విక్రయించేందుకు కుట్ర పన్నుతోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రవికుమార్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మియాపూర్ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 100లో 277 ఎకరాల 05 గుంటలు, సర్వే నంబర్ 101లో 273 ఎకరాల 34 గుంటలు కలిపి మొత్తం సుమారు 550 ఎకరాల 39 గుంటల భూమి ఉంది. 1912 నాటి సర్వే రికార్డుల నుంచే ఇది సర్కారు భూమిగా నమోదై ఉంది. 1949లో జాగీర్ల రద్దుతో పూర్తిగా ప్రభుత్వ పరమైంది. ప్రైవేట్ వ్యక్తుల అక్రమ వాదనలను తోసిపుచ్చుతూ 2003లోనే హైకోర్టు ఈ భూమి ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. తాజాగా దశాబ్దాల న్యాయపోరాటానికి తెరదించుతూ సుప్రీంకోర్టు తుది తీర్పు ఇవ్వడం శుభపరిణామం అని పేర్కొన్నారు.
అధికారం కోసం ఆస్తులు కాపాడుకోవడం కోసం పార్టీలు మారే ఎమ్మెల్యేకు ప్రజల అవసరాలపై ధ్యాస లేదని ధ్వజమెత్తారు. ప్రజల ఓట్లతో గెలిచిన స్థానిక ఎమ్మెల్యేకు చిత్తశుద్ధి ఉంటే ఈ భూముల అమ్మకం ప్రక్రియను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు, సొంత నియోజకవర్గంలో వేలకోట్ల విలువైన ప్రభుత్వ భూములను రియల్ మాఫియా పంచుకుంటున్నా, కనీసం నోరు విప్పలేని అసమర్థుడని అన్నారు, ఈ వేల కోట్ల విలువైన ఆస్తిని ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా, ఖజానా నింపుకోవడానికో లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారుల లాభాల కోసమో కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మకానికి పెట్టాలని చూడటం దుర్మార్గమని, ప్రస్తుతం ఈ విస్తీర్ణంలో సుమారు 150 ఎకరాల్లో పేద ప్రజలు ఎం.ఏ. నగర్, స్టాలిన్ నగర్ వంటి కాలనీలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారని, మిగిలిన 400 ఎకరాలు ఖాళీగా ఉన్నాయని, ఈ భూములను అమ్మి సొమ్ము చేసుకునే బదులు, అన్ని హంగులతో కూడిన ఒక పెద్దాసుపత్రి, ప్రభుత్వ డిగ్రీ/ఇంజనీరింగ్ కళాశాల, ప్రజల ఆహ్లాదం కోసం పార్కులు మరియు నిరుపేదలకు పక్కా గృహనిర్మాణం వంటి ప్రజాహిత పనులకు కేటాయించాలని డిమాండ్ చేశారు, శేరిలింగంపల్లి బిడ్డగా ఇక్కడి ప్రజలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోనని ,తరతరాలుగా గుడిసెలు, ఇళ్లు వేసుకుని నివసిస్తున్న పేదల జోలికొస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు, శేరిలింగంపల్లి ప్రజలారా, మన భూములను మనమే రక్షించుకుందామని, మీకు ఏ కష్టం వచ్చినా అండగా నిలవడానికి, మీ తరఫున అవసరమైతే జైలుకు వెళ్లడానికైనా నేను సిద్ధంగా ఉన్నానని స్థానిక నివాసితులకు ఆయన పూర్తి భరోసా కల్పించారు, ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకపోతే శేరిలింగంపల్లి నుంచే కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలపై పోరాటం ప్రారంభిస్తామని, బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని చేపడతామని రవికుమార్ యాదవ్ హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మాణిక్ రావు, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు విజయేందర్, డివిజన్ అధ్యక్షులు ఆకుల లక్ష్మణ్, శ్రీనివాస్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు సీతారామ రాజు, జిల్లా కౌన్సిల్ సభ్యులు గణేష్ ముదిరాజ్, సీనియర్ నాయకులు రాఘవేంద్ర రావు, నాగేశ్వర్ గౌడ్, సమ్మెట ప్రసాద్, మహేష్ యాదవ్, రాజేష్ గౌడ్, రాము, ప్రకాష్, ప్రవీణ్, మరియు స్థానిక బీజేపీ స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



