Wednesday, November 11, 2026
Google search engine
Homeతెలంగాణగురుకుల హాస్టల్ ను తనిఖీ చేసిన ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి...

గురుకుల హాస్టల్ ను తనిఖీ చేసిన ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి…

ఎల్బీనగర్

గురుకుల హాస్టల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి. గడ్డిఅన్నారం డివిజన్ పరిధిలోని జెడ్‌సీ కార్యాలయం వెనుక ఉన్న గురుకుల హాస్టల్‌ను ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్‌లో విద్యార్థులకు కల్పిస్తున్న వసతి సౌకర్యాలు, భోజన నాణ్యత, తాగునీటి సదుపాయం, పారిశుద్ధ్యం తదితర అంశాలను పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.హాస్టల్‌లో నీటి సమస్య తీవ్రంగా ఉందని గుర్తించారు. విద్యార్థులు వినియోగించే నీటిని 3, 4 అంతస్తులకు కూడా వారే తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉందని తెలుసుకున్నారు. అలాగే 60 మూత్రశాలలకు కేవలం 8 మాత్రమే వినియోగంలో ఉండటం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. మిగిలిన మూత్రశాలలను వెంటనే మరమ్మతులు చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి, పౌష్టికాహారం, స్వచ్ఛమైన తాగునీరు, పరిశుభ్రమైన వాతావరణం అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు. విద్యార్థుల సంక్షేమం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని సూచించారు.హాస్టల్‌లో గుర్తించిన సమస్యలను వెంటనే పరిష్కరించి, విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్,బిచినేపల్లి వెంకటేశ్వరరావు, రమేష్ ముదిరాజ్ శ్రీశైలం యాదవ్, రమణారెడ్డి,గండి సన్నీ యాదవ్,కొత్త రవీందర్ రెడ్డి తదితర స్ధానిక నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments