హైదరాబాద్‌లోని గోషామహల్ స్టేడియంలో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఈరోజు దేశం 140 కోట్ల జనాభా ప్రశాంతంగా గుండెల మీద చేతులు పెట్టుకొని నిద్రపోతున్నారు అంటే లక్షల మంది పోలీసు సిబ్బంది నిరంతరం పహారా కాయడం.
ప్రజల్ని కాపాడడం ప్రజలని కాపాడటమే కాకుండా ప్రజలకు ఏ సమస్య వచ్చినా పోలీస్ శాఖ ఉన్నదాన్ని ఒక విశ్వాసాన్ని కల్పించడం ద్వారా ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఈరోజు పరిపాలన జరుగుతున్నది. ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా అభివృద్ధి పదం వైపు నడవాలి అంటే పెట్టుబడులు రావాలి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అంటే శాంతి భద్రతలు అత్యంత కీలకం శాంతిభద్రతలు లేని రాష్ట్రంలో దేశంలో పెట్టుబడులు రాకపోను ఉన్న పరిస్థితులు కూడా గందరగోళానికి లోనై నిరుద్యోగ సమస్య ఉత్పన్నమైతే ఆ దేశం పూర్తిగా దెబ్బ తినడానికి అవకాశం ఉంటుంది.
అలాంటి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు నిరంతరం పహారా కాస్తూ అవసరమైతే తమ బాధ్యతలో ప్రాణాలైనా వదులుతున్నారు కానీ శాంతిభద్రతల విషయంలో నిఘా విషయంలో వైఫల్యం చెందకుండా నిరంతరం శ్రమిస్తున్నందుకు తెలంగాణ పోలీస్ శాఖ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభినందనలు తెలియజేస్తూ ఈరోజు అమరవీరులను స్మరించుకునే ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం.
1959 భారత్ చైనా సరిహద్దుల్లో జరిగిన పోరాటంలో అమరులైన పోలీసులకు స్మారకంగా అక్టోబర్ 21 ప్రతి సంవత్సరం మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం.
అమరులైన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. అమరులైన కానిస్టేబుల్, ఏఎస్సై కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అమరులైన ఎస్సై, సీఐ కుటుంబాలకు రూ.1. 25 లక్షలు.. డీఎస్పీ, ఏఎస్పీ కుటుంబాలకు రూ.కోటి యాభై లక్షలు.. ఎస్పీ, ఐపీఎస్ కుటుంబాలకు రూ.2 కోట్ల పరిహారం ఇస్తామన్నారు.
తెలంగాణ పోలీసుల విధానాలను ఇతర రాష్ట్రాలు పాటిస్తున్నాయి. మన ఫోరెన్సిక్ ల్యాబ్ అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. మన సైబర్ క్రైమ్ విభాగం దేశంలోనే గొప్పదని కేంద్ర హోంశాఖ అభినందించింది. ఇవాళ డ్రగ్స్ మహమ్మారి యువతను పట్టిపీడిస్తోంది. డ్రగ్స్ వల్ల పంజాబ్ అనేక కష్టాలు ఎదుర్కొంటోంది. మాదకద్రవ్యాల వినియోగం రాష్ట్రంలో క్రమంగా పెరుగుతోంది. వీటి నివారణకు రాష్ట్రంలో టీజీ న్యాబ్‌ను ఏర్పాటు చేశాం. ఏఐ పరిజ్ఞానంతో ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించేవారిని గుర్తిస్తున్నాం. నేరస్థులను కఠినంగా శిక్షించేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. శాంతిభద్రతలను చేతుల్లోకి తీసుకోవద్దని ప్రజలను కోరుతున్నాం. వివిధ పండుగలు ప్రశాంతంగా జరుపుకోవడంలో పోలీసుల సేవలు మరచిపోలేము. జీతం కోసం వారు పనిచేయడం లేదు. బాధ్యతాయుతంగా భావించి సేవలు అందిస్తున్నారు’’ అని రేవంత్‌రెడ్డి తెలిపారు.