Tuesday, July 15, 2025
Google search engine
Homeస్పోర్ట్స్పంత్ చుట్టూ కమ్ముకుంటున్న నీలి మేఘాలు..

పంత్ చుట్టూ కమ్ముకుంటున్న నీలి మేఘాలు..

( మోకాలి గాయంతో బాధపడుతున్న రిషబ్ పంత్.. )

  • పంత్‌ పై నిర్ణయాన్ని జట్టు మేనేజ్‌మెంట్‌కే వదిలేసిన సెలక్టర్లు..
  • ఇక ధృవ్ జుర్ల్ కి దక్కనున్న అవకాశం..

బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ మోకాలి గాయానికి గురైన విషయం విదితమే.. మోకాలికి ఆపరేషన్ ఎక్కడైతే జరిగిందో అదే ప్రదేశంలోనే తిరిగి మరోసారి బంతి తగలడంతో కాలు బాగా వచ్చినట్లు తెలుస్తోంది.. దీంతో తొలి టెస్ట్ రెండవ రోజున పంత్ మైదానం నుంచి బయటకు వెళ్ళిపోయాడు.. . మూడవ రోజు కూడా పంత్ ఫీల్డ్‌లోకి రాలేదు. అతడి స్థానంలో యువ ఆటగాడు ధ్రువ్ జురెల్ కీపింగ్ చేసిన సంగతి కూడా తెలిసిందే.. అయితే నాలుగవ రోజు బ్యాటింగ్‌కు దిగిన పంత్ అదరగొట్టాడు. అత్యంత కీలకమైన రెండో ఇన్నింగ్స్‌లో 99 పరుగులు సాధించి తన సత్తా చాటాడు.. కేవలం ఒకే ఒక్క పరుగు తేడాతో సెంచరీని మిస్ అయ్యాడు పంత్..

అయితే పుణే వేదికగా గురువారం మొదలుకానున్న రెండవ టెస్టు మ్యాచ్‌లో పంత్ ఆడడంపై ఎన్నెన్నో అనుమానాలు నెలకొన్నాయి. రెండవ టెస్టులో పంత్‌ను ఆడించాలా? వద్దా? అన్నది జట్టు మేనేజ్‌మెంట్‌ నిర్ణయానికే సెలక్టర్లు వదిలేశారని ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ రాసిన ఒక కథనంలో పేర్కొంది.. ఒకవేళ రెండవ టెస్టుకు పంత్ దూరమైతే ధృవ్ జురెల్‌ను వికెట్ కీపర్‌గా జట్టులోకి తీసుకునే అవకాశం మెండుగా ఉంది. ఈ మేరకు జట్టు మేనేజ్‌మెంట్ ఆలోచన చేసే అవకాశం ఉందని వార్తలు అందుతున్నాయి.. ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌ జరగనున్న నేపథ్యంలో నమ్మదగిన ఆప్షన్‌గా ఉన్న జురెల్‌ను జట్టు మేనేజ్‌మెంట్ పరీక్షించే అవకాశం ఉందని ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ కథనం పేర్కొనడం గమనార్హం.. కాగా న్యూజిలాండ్‌ చేతిలో తొలి టెస్ట్ ఓటమి అనంతరం రిషబ్ పంత్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఆటలో హెచ్చు తగ్గులు ఉంటాయని, అయితే ఇబ్బందులు ఎదురైన ప్రతిసారీ బలంగా ఎదగడం పంత్ స్పెషలిటీగా చెప్పుకోవచ్చు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments