Home స్పోర్ట్స్ పాకిస్తాన్ లో మేము ఛాంపియన్స్‌ ట్రోఫీ ఆడం… తేల్చిచెప్పిన భారత్?

పాకిస్తాన్ లో మేము ఛాంపియన్స్‌ ట్రోఫీ ఆడం… తేల్చిచెప్పిన భారత్?

0
పాకిస్తాన్ లో మేము ఛాంపియన్స్‌ ట్రోఫీ ఆడం… తేల్చిచెప్పిన భారత్?
India decided to play Champions Trophy in Pakistan

ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 పాకిస్థాన్ నిర్వహించబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే మ్యాచ్‌ల నిర్వహణ కోసం మూడు స్టేడియాల్లో ఆధునికీకరణ పనులు చేపడుతోంది. అయితే, పాకిస్థాన్‌కు వెళ్లి టోర్నీలో ఆడేందుకు భారత జట్టు సిద్ధంగా లేదు. టోర్నమెంట్‌ను హైబ్రిడ్‌ మోడల్‌లో నిర్వహిస్తేనే పాల్గొంటామని భారత్ ఐసీసీకి తేల్చి చెప్పేసింది . భారత్ ఆడే మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించాలని పాక్ క్రికెట్‌ బోర్డు ని ఐసీసీ కోరింది. కానీ, ఈ ప్రతిపాదనకు పీసీబీ ఒప్పుకోలేదని తెలిసింది. తమ ఆతిథ్య హక్కులను తగ్గిస్తే టోర్నీ నుండి తప్పుకోవాలని పాక్‌ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇరు దేశాల మధ్య వివాదాలు పరిష్కారమయ్యే వరకు.. భారత్‌లో జరిగే మరే ఇతర ఐసీసీ ఈవెంట్లలోనూ పాల్గొనకూడదని పాక్ భావిస్తోందట.
ఒకవేళ పీసీబీ ఇలాగే మొండిగా వ్యవహరించి హైబ్రిడ్ మోడల్‌కు అంగీకరించకపోతే టోర్నీ మొత్తాన్ని సౌతాఫ్రికాలో నిర్వహించే అవకాశమున్నట్లు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here