రివర్ కామ్ క్రూజ్ పేరుతో లాంచ్..
80 మంది ప్రయాతాకులతో నాగార్జున సాగర్ నుంచి..
శ్రీశైలం లింగాలగట్టు వరకు..
తెలంగాణ టూరిజం సంస్థ ఆధ్వర్యంలో కృష్ణమ్మ ఒడిలో పడవ ప్రయాణాన్ని శనివారం ప్రారంభించారు. రివర్ కమ్ క్రూజ్ పేరుతో శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ లాంచ్.. 80 మంది పర్యాటకులతో నాగార్జున సాగర్ నుంచి బయల్దేరి సాయంత్రం 5 గంటలకు శ్రీశైలం లింగాలగట్టుకు చేరుకుంది.
రివర్ కమ్ క్రూజ్ పేరుతో ప్రతిరోజు ఉదయం సాగర్ నుంచి బయల్దేరి సాయంత్రం శ్రీశైలం వచ్చిన లాంచ్.. మరుసటి రోజు శ్రీశైలం నుంచి సాగర్‌కు తిరుగు ప్రయాణం అవుతుందని టూరిజం అధికారులు తెలిపారు. నల్లమల ప్రకృతి అందాలను వీక్షిస్తూ కృష్ణానదిపై పడవ ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా ఉందని పర్యాటకులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. అదే విధంగా పర్యాటక సంస్థవారు లాంచ్ టికెట్‌తోపాటు సకల సదుపాయాలు కల్పిస్తున్నప్పటికీ శ్రీశైల క్షేత్రంలో వసతి, స్వామిఅమ్మవార్ల దర్శనం కూడా కల్పించే ఏర్పాటు చేయాలని యాత్రికులు కోరుకుంటున్నారు.