Wednesday, July 9, 2025
Google search engine
Homeఎడ్యుకేషన్తెలంగాణ గ్రూప్‌ 3 హాల్‌టికెట్లు విడుదల… అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచిన టిజీపీఎస్సీ

తెలంగాణ గ్రూప్‌ 3 హాల్‌టికెట్లు విడుదల… అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచిన టిజీపీఎస్సీ

టిజీపీఎస్సీ గ్రూప్‌ 3 హాల్‌టికెట్లు అధికారిక వెబ్‌సైట్‌లో విడుదలయ్యాయి. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్‌లో ఏదైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే TGPSC టెక్నికల్‌ హెల్ప్‌ డెస్క్‌ ఫోన్‌ నంబర్‌ 040-2354 2185 లేదా 040-2354 2187 సంప్రదించాలని లేదా Helpdesk@tspsc.gov.in కు ఈ-మెయిల్‌ చేయవచ్చని తెలిపారు. అభ్యర్థులు https://www.tspsc.gov.in/ వెబ్‌సైట్‌ ద్వారా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

తెలంగాణ గ్రూప్‌-3 పరీక్షలు నవంబర్‌ 17, 18 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఏర్పాట్లు కూడా చేశారు. పరీక్ష 17వ తేదీ రోజు రెండు సెషన్లలో 18 వ తేదీ మొదటి సెషన్లలో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్‌-1.. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్‌-2 నిర్వహించనున్నారు. అలాగే నవంబర్‌ 18న పేపర్‌-3 పరీక్షను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహిస్తారు. తెలంగాణలో దాదాపు 1380 గ్రూప్‌-3 పోస్టులకు 5.36 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments