యువతకు జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య పిలుపు
ఎల్బీనగర్
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్ ) హయత్నగర్ సర్కిల్ కమిటీ సమావేశం భీమనపల్లి కనకయ్య అధ్యక్షతన జరిగింది, ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సిపిఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం చంద్రమోహన్ హాజరై మాట్లాడుతూ, ఈనెల 20న కలెక్టర్ కార్యాలయంలో వద్ద జరుగు నిరుద్యోగులు ఆందోళనలు జయప్రదం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు గతంలో నిరుద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలని అమలు చేయాలని డిమాండ్ చేశారు. బిజెపి అధికారంలోకి వచ్చే ముందు సంవత్సరానికి మూడు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి 12 సంవత్సరాలు అవుతున్న నేటికి అమలు చేయలేదని, కనీసం కోటి ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని అన్నారు, బిజెపి, కాంగ్రెస్ ప్రభుత్వలు నిరుద్యోగులకు చేసిన వాగ్దానాలని అమలు చేయాలని డిమాండ్ చేశారు. నేడు దేశంలో యువతీయువకులకు ఉద్యోగం లేక అనేకమంది తప్పుదారి పడుతున్నారని ఆ యువతని కాపాడాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉన్నదని అన్నారు. ప్రభుత్వ సంస్థల్లో ఏర్పడ్డ ఖాళీలన్నీటిని భర్తీ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు, నేటికీ అనేక సంస్థల్లో కాంట్రాక్టు ఉద్యోగాల నియామకం చేస్తున్నారు కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేసి, అర్హులైన వారందరినీ రెగ్యులర్ ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. నిరుద్యోగ సమస్య తక్షణమే పరిష్కారం చెయ్యాలని కోరారు లేనిచో యువత ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్తాయని హెచ్చరించారు.నిరుద్యోగులకు భృతి ఇస్తానని చెప్పి వాగ్దానం చేసిందని ఆ వాగ్దానాన్ని అమలు చేయాలని కోరారు. ఈనెల 17, 18 తేదీలలో దిల్సుఖ్నగర్, ఇబ్రహీంపట్నం, శంషాబాద్ కేంద్రాలలో జరిగే నిరుద్యోగ యువత నిర్వహించే ధర్నాలలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. లేనిచో యువత ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. పోరాటంలో నిరుద్యోగ యువతీ యువకుల సమస్యల పరిష్కారం కోసం పోరాడుదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం చంద్రమోహన్, సర్కిల్ కార్యదర్శి కీసరి నర్సిరెడ్డి, సర్కిల్ కమిటీ సభ్యులు భీమనపల్లి కనకయ్య, చింతపల్లి కృష్ణయ్య, ముషం నరహరి, బిట్రా మూర్తి, తదితరులు పాల్గొన్నారు.


