మీడియా అటాచ్మెంట్ ఫైల్స్
రూ. 53 వేల 1 రూపాయికి దక్కించుకున్న దొంతి రవి శంకర్ ముదిరాజ్.
శ్రీకృష్ణ యూత్ సభ్యులు వేలంలో లడ్డూను దక్కించుకున్న దొంతి రవి శంకర్ ముదిరాజ్‌కు అందజేస్తున్న లడ్డు.
భారత శక్తి సెప్టెంబర్ 27 శేరిలింగంపల్లి : హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని గంగారం గ్రామంలో శ్రీ కృష్ణ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ నిమజ్జనోత్సవం
శనివారం రాత్రి భక్తి శ్రద్దలతో ఘనంగా నిర్వహించారు. గణేష్ లడ్డు వేలం పాట ఉత్సాహంగా సాగింది. గ్రామస్తులు, యువత ఆసక్తిగా పాల్గొని వేలం
పాటలో లడ్డూకు మంచి డిమాండ్ ఏర్పాటింది. రూ.53 వేల 1 రూపాయికి దొంతి రవిశంకర్ ముదిరాజ్ లడ్డూను కైవసం చేసుకున్నారు. శ్రీకృష్ణ యూత్ నిర్వహకులు రవి శంకర్ ముదిరాజ్‌కు లడ్డూను అందజేశారు. వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గణేష్ విగ్రహాన్ని గ్రామంలో ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేశారు. యువత గ్రామస్తులు, పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాన్ని విజయవంతం చేశారు. ఈ ఊరేగింపులో సాయి కిషోర్, దొంతి సాయి కృష్ణ, విశ్వతేజతో పాటు శ్రీకృష్ణ యూత్ సభ్యులు, గ్రామ పెద్దలు, యువత గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


