ఎల్బీనగర్:
గడ్డిఅన్నారం డివిజన్ పి&టీ కాలనీలో గణేష్ యువ భక్త మండలి ఆధ్వర్యంలో ప్రతిష్ఠించనున్న 39 అడుగుల ఎకో ఫ్రెండ్లీ గణేష్ విగ్రహం తయారీకి నిర్వహించిన కర్ర పూజ కార్యక్రమంలో ఆదివారం ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం పోస్టర్ విడుదల చేశారు.ఈ సందర్భంగా గణేష్ యువ భక్త మండలి సభ్యులకు, నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ఎకో ఫ్రెండ్లీ గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, యువకులు పాల్గొన్నారు .


