Wednesday, October 14, 2026
Google search engine
Homeతెలంగాణజ్యోతి క్లబ్ మైదానంలో వైభవంగా మహా బతుకమ్మ

జ్యోతి క్లబ్ మైదానంలో వైభవంగా మహా బతుకమ్మ

  • ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో అట్టహాసంగా కార్యక్రమం
  • ప్రత్యేక ఆకర్షణగా ఆడి పాడిన జానపద గాయని మంగ్లీ

ఎల్బీనగర్:

ఎల్బీనగర్లో అంగరంగ వైభవంగా మహా బతుకమ్మ సంబురాలు జరిగాయి. ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, జయచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్టు చైర్ పర్సన్ దేవిరెడ్డి కమలారెడ్డి ఆధ్వర్యంలో లింగోజిగూడ డివిజన్లోని సరూర్ నగర్ జ్యోతి క్లబ్ మైదానంలో సోమవారం సాయంత్రం మహా బతుకమ్మ సంబురాల్లో వేలాది మంది మహిళలు పాల్గొని సంబురంగా గడిపారు. ఈ ఉత్సవాల్లో ప్రముఖ గాయని మంగ్లీ పాల్గొని తెలంగాణ జానపదాలు, బతుకమ్మ పాటలు, ఆటలతో ఉర్రుతలూగించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగలో మహిళలు మైదానం చుట్టూరా ఎక్కడ చూసినా సర్కిళ్లుగా ఏర్పడి ఈ సంబురాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన మంగ్లీ పాటలకు బతుకమ్మలు ఆడుతూ సందడి చేశారు. మంగ్లీ టీం పాటలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

బతుకమ్మ సంబురాలు అద్భుతం

తెలంగాణలో సంస్కృతి, సంప్రదా యాలకు ప్రతీకగా బతుకమ్మ సంబురాలు జరుపుకుంటారని, బతుకమ్మ సంబురాలు ఒక అద్భుతమన్నారు. ఇది మహిళల పండుగ అని, పూల పండుగ అని తెలంగాణలో అతిపెద్ద పండుగ అని అన్నారు. బతుకమ్మ సంబురాల్లో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొనడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు.బతుకమ్మ సంబరాలకు హాజరైన మహిళలతో పాటుగా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆయన సతీమణి దేవిరెడ్డి కమలా రెడ్డి కూడా బతుకమ్మలను ఆడుతూ మహిళలను ఉత్సాహ పరిచారు.

ఎటు చూసినా మహిళల సందడే

బతుకమ్మ సంబురాల్లో ఎటు చూసినా మహిళల సందడే కన్పించింది. డివిజన్ల వారీగా హాజరైన మహిళలు తమ తోటి వారితో కలిసి ఓ జట్టుగా ఏర్పడి బతుకమ్మ ఆడారు. ఇలా అన్ని డివిజన్ల వారు మంగ్లీ టీం పాటలకు బతుకమ్మ ఆడుతూ సంబురాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరి దగ్గరికి ఎమ్మెల్యే దంపతులు వెళ్లి వారిని పలుకరించడంతో పాటుగా వారితో కలిసి బతుకమ్మ ఆడుతూ వారిని ఉత్సాహ పరిచారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, డివిజన్ల అధ్యక్షులు, మహిళా విభాగం ముఖ్య నాయకులతో పాటుగా పెద్ద సంఖ్యలో మహిళలు, యువతులు, కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments