హైదరాబాద్
పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా డిజిపి కార్యాలయంలో మంగళవారం రక్తదాన శిబిరాన్ని డిజిపి సి.వి. ఆనంద్ ప్రారంభించారు. అక్టోబరు 21 నుంచి 31 వరకు నిర్వహిస్తున్న ఈ పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణ కోసం నిరంతరం శ్రమించే పోలీసులు.. అత్యవసర సమయాల్లో రక్తదానం ద్వారా కూడా ప్రాణదాతలుగా నిలుస్తున్నారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రజా భద్రతతో పాటు ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం పోలీసుల సామాజిక బాధ్యతకు నిదర్శనమన్నారు.
కార్యక్రమంలో డిజి లా & ఆర్డర్ మహేశ్ భగవత్, ఎడిజి అకున్ సబర్వాల్, మల్టీ జోన్ II, ఐజి షానవాజ్ ఖాసీం, రెడ్‌క్రాస్ సొసైటీ డైరెక్టర్ పిచ్చిరెడ్డి తో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.



