- దేవిరెడ్డి జయచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వేడుకలు
- ప్రముఖ జానపద గాయని మంగ్లీ సంగీత ప్రదర్శన
ఎల్బీనగర్,
తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేకంగా నిలిచే బతుకమ్మ పండుగను ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తెలిపారు. దేవిరెడ్డి జయచంద్రారెడ్డి ట్రస్ట్ చైర్ పర్సన్ దేవిరెడ్డి కమలారెడ్డి ఆధ్వర్యంలో ఈ బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. నేటి సాయంత్రం 6 గంటలకు లింగోజిగూడ డివిజన్లోని జ్యోతి క్లబ్ మైదానంలో బతుకమ్మ సంబరాలు ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకల్లో ప్రముఖ జానపద గాయని మంగ్లీ ప్రత్యక్ష సంగీత ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ కార్యక్రమానికి హాజరైన వారికి ప్రత్యేక బహుమతులు అందజేయున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఎల్బీనగర్ నియోజకవర్గం లోని మహిళలు, యువతులు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ సంబరాలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని చాటేలా బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.


