సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో 5 కేఎం మారథాన్ ప్రారంభించిన మల్‌రెడ్డి రాంరెడ్డి
ఎల్బీనగర్:
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక-99 రోజుల కార్యాచరణలో భాగంగా మే 18 నుండి 23 వరకు రాష్ట్ర వ్యాప్తంగా యువజన క్రీడా వారోత్సవాలు జరుపుతున్నట్లు రాష్ట్ర క్రీడా శాఖ అధికారులు తెలిపారు.ఈ సందర్బంగా, సోమవారం రంగారెడ్డి జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం నుండి కొత్తపేట్ వరకు నిర్వహించిన 5కేయం మారథాన్ ను జెండా ఊపి ప్రారంభించిన రాష్ట్ర రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి, రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ డాక్టర్ కొప్పిషెట్టి కిరణ్మయి ఐఏఎస్, జిల్లా యువజన, క్రీడా శాఖ అధికారిణి (డివైఎస్ఓ) శ్రీమతి ఎస్.స్వర్ణలత, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మల్లారెడ్డి.ఈ సందర్భంగా మల్‌రెడ్డి రాంరెడ్డి మాట్లాడుతూ, యువత ఆరోగ్యంగా, క్రమశిక్షణతో, క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు.రాష్ట్ర యువజన మరియు క్రీడాశాఖ ఆధ్వర్యంలో యువతలో శారీరక దారుఢ్యం, నాయకత్వ లక్షణాలు, క్రీడా స్ఫూర్తి, సామాజిక బాధ్యతాభావం పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం యువతకు ఉద్యోగ, నైపుణ్యాభివృద్ధి, క్రీడలు, నాయకత్వ వికాసం వంటి రంగాలలో విస్తృత అవకాశాలు కల్పిస్తోందని పేర్కొన్నారు. యువత దేశ భవిష్యత్తు అని, క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక వికాసానికీ దోహదపడతాయని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన “ఫిట్ & యాక్టివ్ తెలంగాణ” లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా మారథాన్‌లు, వాక్‌థాన్‌లు, యోగా, జుంబా, క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ వారోత్సవాలలో భాగంగా కెరీర్ & స్కిల్ డెవలప్‌మెంట్, యూత్ లీడర్‌షిప్ సమ్మిట్స్, స్పోర్ట్స్ డే, క్లీన్ తెలంగాణ కార్యక్రమాలు, ఉద్యోగ సాధన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏయంసీ డైరెక్టర్ పన్యాల జైపాల్ రెడ్డి, యువజన ప్రతినిధులు, క్రీడాకారులు, విద్యార్థులు, యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు


