పిఎసి చైర్మన్, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ…..:
స్ప్రింగ్ వ్యాలీ, TGHB హౌసింగ్ బోర్డ్ కాలనీలలో రూ. 4 కోట్ల 63 లక్షల అంచనావ్యయంతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు, స్మశాన వాటిక, పార్క్ అభివృద్ది పనులకు తాజా మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేసిన పిఎసి చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ
ఈ సందర్భంగా పిఎసి చైర్మన్, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం మరియు శేరిలింగంపల్లి నియోజకవర్గం, కాలనీల అభివృద్దే ధ్యేయంగా ప్రజల సౌకర్యార్థం శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని దూబే కాలనీ, డొయన్స్, అలిండ్ ఎంప్లాయిస్ కాలనీ, మసీదు బండ, ప్రభుపాద లే ఔట్, సెంట్రల్ పార్క్ ఫేజ్ 1, శిల్ప వ్యాలీ, స్ప్రింగ్ వ్యాలీ, TGHB హౌసింగ్ బోర్డ్ కాలనీలలో రూ. 4 కోట్ల 63 లక్షల, గచ్చిబౌలి డివైజాన్లో రూ. 1 కోటి 20 లక్షల అంచనావ్యయంతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు, స్మశాన వాటిక, పార్క్ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసుకోవడం జరిగినది అని, సీసీ రోడ్ల పనులు మరియు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని, కాలనీల వాసులకు నేటితో ఉపశమనం లభించింది అని తెలిపారు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకంలో మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో శేరిలింగంపల్లి నియోజకవర్గం ను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని , శేరిలింగంపల్లి నియోజకవర్గం ను అగ్రభాగాన నిలబెడుతామని తెలిపారు.
సంక్షేమం మరియు అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకం లో శేరిలింగంపల్లి నియోకజకర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన ,అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదితానని తెలియచేసారు. అదేవిధంగా మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని, అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని ,నాణ్యత విషయంలో ఎక్కడ రాజి పడకూడదని ప్రజలకు ట్రాఫిక్ రహిత ,సుఖవంతమైన ,మెరుగైన రవాణా సౌకర్యం కొరకు శాయ శక్తుల కృషి చేస్తానని,అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని చెప్పడం జరిగినది. పనుల్లో జాప్యం లేకుండా త్వరిత గతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించడం జరిగినది , ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కలిపిస్తామని ,ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తామని చెప్పడం జరిగినది.
స్మశాన వాటికలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని, ప్రహరీ గోడ, స్నానపు గదులు మరియుd విశ్రాంతి గదులను నిర్మిస్తామని, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తామని అదేవిధంగా పార్కు లను సుందర శోభిత వనంలు గా తీర్చిదిద్దుతామని , కాలనీ వాసులకు చక్కటి ప్రశాంతమైన వాతావరణం కల్పిస్తామని, పార్క్ లో వాకింగ్ చేసేవారికి, వృద్ధులు సేదతీరడానికి, పిల్లలకు ఆటవిడుపు గా పార్క్ లను తీర్చిదిద్దుతామని తెలియచేశారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని ,అన్నివేళలో ప్రజలకు అందుబాటులోకి ఉంటానని ,మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని, శేరిలింగంపల్లి డివిజన్ మరియు శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని పునరుద్ఘాటించారు.వారి
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు మారబోయిన రాజు యాదవ్, గౌరవ అధ్యక్షులు వీరేశం గౌడ్, ప్రధాన కార్యదర్శి చింతకింది రవీందర్ గౌడ్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు, మహిళా సోదరీమణులు , కాలనీల అసోసియేషన్ సభ్యులు,మహిళలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు



