ఎల్బీనగర్:
కాలనీ మాజీ అధ్యక్షుడు, పోలీసుల వేధింపులు తట్టుకోలేక సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న మాజీ కాలనీ అధ్యక్షుడు.హయత్ నగర్ డివిజన్ పరిధిలోని లక్ష్మి ప్రియా నగర్ కాలనీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కాలనీ మాజీ అధ్యక్షుడు మధు ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపుతోంది. గత కొన్ని రోజులుగా కాలనీలో నెలకొన్న అంతర్గత సమస్యల నేపథ్యంలో, కాలనీ మాజీ అధ్యక్షుడు బోడ యాదగిరి గౌడ్ మరియు ఆయన సోదరుడు రమణ గౌడ్ తనపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారని మధు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.ఈ వేధింపులకు తోడు, హయత్ నగర్ పోలీస్ స్టేషన్ అధికారి కూడా జోక్యం చేసుకుని టార్చర్ చేయడంతో మధు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఒకవైపు కాలనీ మాజీ అధ్యక్షుల వేధింపులు, మరోవైపు పోలీసుల నుండి ఎదురైన బెదిరింపులు తట్టుకోలేక ఆయన ఈ దారుణ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘటనపై స్థానికులు మరియు మధు కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఈ కేసును విచారణలోకి తీసుకున్నారు.



