Wednesday, April 29, 2026
Google search engine
Homeతెలంగాణబడంగ్‌పేట్‌లో వీధి కుక్కల దత్తత కార్యక్రమం

బడంగ్‌పేట్‌లో వీధి కుక్కల దత్తత కార్యక్రమం

బడంగ్‌పేట్:

శంషాబాద్ జోన్ పరిధిలోని బడంగ్‌పేట్ సర్కిల్ చందాన చెరువు వద్ద మంగళవారం వీధి కుక్కల దత్తత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని బడంగ్‌పేట్ డిప్యూటీ కమిషనర్ వి. సమ్మయ్య ప్రారంభించారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. వీధి కుక్కల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు, జంతు సంక్షేమాన్ని పెంపొందించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. కుక్క కాటుకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నివారణోపాయాలపై పౌరులకు అవగాహన కల్పించి, సంబంధిత కరపత్రాలను పంపిణీ చేశారు.
కార్యక్రమంలో శంషాబాద్ జోన్ వెటర్నరీ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ రవిచంద్ర, డీఈ అభినయ్ కుమార్, ఏఎంఓహెచ్ ప్రవీణ్ కుమార్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments