సిద్దిపేట:
సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేట 10వ వార్డులో కౌన్సిలర్ తన హామీని నిలబెట్టుకున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం, వార్డులో జరిగే ప్రతి అమ్మాయి పెళ్లికి సహాయం అందిస్తానన్న వాగ్దానాన్ని అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం పూస సత్తవ్వ – కీ.శే. శ్రీ ఎల్లయ్య గారి ద్వితీయ కుమార్తె మహేశ్వరి వివాహ సందర్భంగా, కౌన్సిలర్ బడుగు రాజు రూ. 5,016/- నగదు కానుకగా అందజేశారు.ఈ కార్యక్రమంలో 11వ వార్డు కౌన్సిలర్ నందాల శ్రీకాంత్ గారు, పెంబర్తి శ్రీశైలం, బత్తిని సతీష్, చెట్ల హరీష్, పెంబర్తి కార్తీక్, పూస రమేష్ మరియు మహిళలు తదితరులు పాల్గొన్నారు.


