దుబ్బాక:
హైదరాబాద్ లాలాపేటలో తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డిని దుబ్బాక నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దుబ్బాక వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొంగరి రవి, దుబ్బాక మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు మల్లుగారి రాం చంద్రా రెడ్డి భేటీలో పాల్గొన్నారు. ప్రాంతీయ వ్యవసాయం, పాల ఉత్పత్తిదారుల అభివృద్ధి, రైతులకు అందుబాటులో ఉండే సంక్షేమ కార్యక్రమాలపై చర్చించినట్లు తెలిపారు. నాయకులు గుత్తా అమిత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేసి, భవిష్యత్తులో రైతులకు మరింత మేలు జరిగేలా కృషి చేయాలని కోరారు.


