Monday, November 2, 2026
Google search engine
Homeతెలంగాణవైవిధ్యంలో ఏకత్వమే భారతదేశ అసలైన బలం

వైవిధ్యంలో ఏకత్వమే భారతదేశ అసలైన బలం

  • భాషలు, సంస్కృతులు దేశ ఐక్యతకు పునాదులు రాష్ట్రాల స్థాపన దినోత్సవంలో గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా
  • ప్రత్యేక ఆకర్షణగా సాంస్కృతిక కార్యక్రమాలు

హైదరాబాద్‌

భారతదేశంలోని భాషా, సాంస్కృతిక, ప్రాంతీయ వైవిధ్యాలు జాతీయ ఐక్యతకు బలమైన పునాదులని తెలంగాణ గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా అన్నారు.

వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల స్థాపన దినోత్సవాలను ఒకే వేదికపై నిర్వహించడం ‘ఏక్‌ భారత్‌.. శ్రేష్ఠ భారత్‌’ స్ఫూర్తికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశయాలకు అనుగుణంగా దేశ ఐక్యతను మరింత బలోపేతం చేసే ఈ కార్యక్రమం హైదరాబాద్‌లో జరగడం ఆనందంగా ఉందన్నారు.

ఆదివారం సాయంత్రం
లోక్‌భవన్‌ సంస్కృతి కమ్యూనిటీ హాల్ లో ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, హర్యానా, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌, తమిళనాడు రాష్ట్రాలతో పాటు అండమాన్‌ నికోబార్‌ దీవులు, చండీగఢ్‌, ఢిల్లీ, లక్షద్వీప్‌, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాల అవతరణ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.

రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా, తన సతీమణి శ్రీమతి జానకి శుక్లా తో కలిసి జ్యోతి ప్రజ్వలనతో వేడుకలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ..
హైదరాబాద్‌ నగరాన్ని మినీ భారతంగా అభివర్ణించారు. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను తెలంగాణ ఎల్లప్పుడూ ఆప్యాయంగా ఆహ్వానిస్తోందని, సమ్మిళిత సంస్కృతి, పరస్పర సామరస్యంతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతోందని తెలిపారు.

భారతదేశ ఐక్యత, సమగ్రతకు సర్దార్‌ వల్లభభాయ్‌ పటేల్‌ అందించిన సేవలు చిరస్మరణీయమని గవర్నర్‌ అన్నారు. అక్టోబర్‌ 31న జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని నిర్వహించుకున్నామని, నేడు వివిధ రాష్ట్రాల స్థాపన దినోత్సవాలను జరుపుకోవడం ద్వారా దేశ ఐక్యత నిదర్శనం అన్నారు.భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడినా.. అన్ని రాష్ట్రాలు పరస్పరం అనుసంధానమై ఉన్నాయని వివరించారు.
ప్రతి రాష్ట్రానికీ ప్రత్యేక చరిత్ర, భాష లు సాంస్కృతిక సంగమం దేశ వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయని అన్నారు.
ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లి స్థిరపడిన ప్రజలు తమ సొంత సంప్రదాయాలను పాటిస్తూనే స్థానిక సంస్కృతులను కూడా ఆచరిస్తున్నారని చెప్పారు. రాజస్థాన్‌ నుంచి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడిన ప్రజలు తమ సంప్రదాయాలతో పాటు ఇక్కడి బతుకమ్మ వంటి పండుగలను కూడా జరుపుకోవడం ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు.
సమష్టి కృషితోనే వికసిత భారత్‌
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ‘సబ్‌కా సాథ్‌.. సబ్‌కా వికాస్‌.. సబ్‌కా విశ్వాస్‌.. సబ్‌కా ప్రయాస్‌’ స్ఫూర్తితో వికసిత భారత్‌ దిశగా ముందుకు సాగాలని గవర్నర్‌ పిలుపునిచ్చారు. ఆత్మనిర్భరత, సమ్మిళిత అభివృద్ధి, మానవీయ విలువలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. విద్య, వ్యాపార రంగాల సాధికారత, మహిళా నాయకత్వం, పర్యావరణ పరిరక్షణ, సమాజంలోని చివరి వ్యక్తి వరకు సుపరిపాలన అందించడం అభివృద్ధిలో కీలకమని పేర్కొన్నారు.
సమాజంలోని ప్రతి వర్గం, ప్రతి ప్రాంతం దేశ ప్రగతిలో భాగస్వామ్యమైనప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.
నీటి సంరక్షణ అందరి బాధ్యత
హైదరాబాద్‌ సహా తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు ఆశించిన స్థాయిలో కురవని పరిస్థితుల్లో నీటి సంరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ప్రకృతి పరిరక్షణ కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రజలందరి సమష్టి బాధ్యత అని స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు మాట్లాడుతూ…వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రజలు సమష్టిగా దేశ అభివృద్ధికి కృషి చేస్తూ దేశాన్ని సమున్నతంగా నిలపాలన్నారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను కట్టిపడేశాయి.

గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ ఎం దాన కిషోర్ , హోం శాఖ కార్యదర్శి శ్రీమతి శిఖా గోయల్, తెలంగాణ జూ పార్కుల సంచాలకులు (Director of Zoo Parks) డాక్టర్ సునీల్ ఎస్. హీరేమత్, సంయుక్త కార్యదర్శి శ్రీ కొమండూరు శశి కిరణ్.పెద్ద సంఖ్యలో హాజరైన సంబంధిత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments