Monday, October 12, 2026
Google search engine
Homeతెలంగాణహఫీజ్ పేట్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు – ముఖ్య అతిథిగా పాల్గొన్న చేవెళ్ల ఎంపీ...

హఫీజ్ పేట్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు – ముఖ్య అతిథిగా పాల్గొన్న చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి…

శేరిలింగంపల్లి :

హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని ఓల్డ్ హఫీజ్పేట్ లో బీజేపీ హఫీజ్‌పేట్ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ బోయిని అనుషా మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి హాజరై మహిళలకు, ఆడపడుచులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, ప్రకృతిని పూజిస్తూ పూలతో తల్లి బతుకమ్మను ఆరాధించడం ఈ పండుగ ప్రత్యేకత అని పేర్కొన్నారు. మహిళల ఐక్యతకు, తెలంగాణ ఆత్మగౌరవానికి, మన సాంస్కృతిక వారసత్వానికి బతుకమ్మ పండుగ ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. మన పండుగలు, సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. ఈ వేడుకల్లో హఫీజ్‌పేట్‌తో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు, ఆడపడుచులు పాల్గొని తమ బతుకమ్మలను అందంగా అలంకరించి, సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహిస్తూ ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నారు. రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలు, మహిళల ఆటపాటలు, సాంస్కృతిక సందడి ఈ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

అనంతరం బతుకమ్మలను తీసుకువచ్చిన మహిళలకు, పోటీల్లో పాల్గొన్న వారికి ప్రోత్సాహకంగా బహుమతులు అందజేశారు. మహిళల భాగస్వామ్యం, ఉత్సాహం, సంప్రదాయాల పట్ల వారికున్న అభిమానం ఈ కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేశాయి.
బోయిని అనుషా మహేష్ యాదవ్ మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే బతుకమ్మ పండుగను ప్రజలందరి భాగస్వామ్యంతో ఘనంగా నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మహిళలు, ఆడపడుచులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ వేడుకలను విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రోత్సహించే కార్యక్రమాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు.

ఈ వేడుకలు హఫీజ్‌పేట్ ప్రాంతంలో పండుగ వాతావరణాన్ని నింపగా, మహిళల ఆనందోత్సాహాల మధ్య బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా ముగిశాయి.
ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున శేర్లింగంపల్లి నాయకులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments