ఎల్బీనగర్
చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపేట, సత్యనగర్ కాలనీలో గల గాయత్రి ప్రణవమ్ ఎలైట్ అపార్ట్‌మెంట్స్‌లో హత్య సంఘటన చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే, వరంగల్‌కు చెందిన కొంతం ప్రభాకర్ (55) తన భార్య రాజిత (45), ఇద్దరు కుమార్తెలతో కలిసి గత కొంతకాలంగా హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. ప్రభాకర్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరు కొత్తపేటలోని సత్యనగర్ కాలనీలో గల గాయత్రి ప్రణవమ్ ఎలైట్ అపార్ట్మెంట్స్లోని ఫ్లాట్ నంబర్ 501లో అద్దెకు నివసిస్తున్నారు.శనివారం ఉదయం సమయంలో ప్రభాకర్ అతని భార్య రాజిత మధ్య కుటుంబ విషయాలపై గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రాజిత కోపోద్రిక్తురాలై కూరగాయలు కోయడానికి ఉపయోగించే కత్తితో ప్రభాకర్ ఛాతీపై పొడిచినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.దీంతో తీవ్ర రక్తస్రావానికి గురైన ప్రభాకర్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే అతని ఇద్దరు కుమార్తెలు 108 అంబులెన్స్ ద్వారా కొత్తపేటలోని ఓమ్ని ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.ఈ సంఘటనపై మృతుడి తమ్ముడు కొంతం విజయభాస్కర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చైతన్యపురి పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 1291/2026, సెక్షన్ 103(1) BNS కింద హత్య కేసు నమోదు చేయడం జరిగింది.
పోలీసుల చర్యలు:
ఈ కేసును చైతన్యపురి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కె. సైదులు, డిఐలు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సంఘటనకు సంబంధించిన పరిస్థితులు, సాక్ష్యాధారాలు మరియు ఇతర అంశాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
ప్రజలకు విజ్ఞప్తి:
కుటుంబ కలహాలు, ఆవేశపూరిత నిర్ణయాలు ప్రాణనష్టానికి దారితీయకుండా ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలి. ఏవైనా కుటుంబ సమస్యలు తలెత్తినప్పుడు చట్టపరమైన మార్గాలను ఆశ్రయించాలని పోలీసులు సూచిస్తున్నారు.



