శేరిలింగంపల్లి :
దుర్గం చెరువులో దూకి యువకుడు మృతి చెందిన సంఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ కె.వి సుబ్బారావు తెలిపిన వివరాల ప్రకారం శనివారం సాయంత్రం నల్లగండ్ల లోని మీరు అపార్ట్మెంట్స్ బి బ్లాక్ లో నివాసముంటున్న వెంకటరామ మాణిక్యరావు కుమారుడు సాయి మహేశ్వర్ (29) మాదాపూర్లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పై నుండి చెరువులో దూకి మరణించాడు. కొన్ని సమస్యల కారణంగానే అతను మరణించాడని పేర్కొంటూ, శనివారం రాత్రి అతని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


