సిద్దిపేట :
ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని దుబ్బాక ఏఎంసీ చైర్మన్ కొంగరి రవి, ఏపీఎం టేక్మాల్ రామకృష్ణ అన్నారు.బుధవారం దుబ్బాక మండల పరిధిలోని పద్మనాభుని పల్లి, తిమ్మాపూర్, అప్పనపల్లి గ్రామాల్లో ఏఎంసీవైస్ చైర్మన్ కడదూరి నరేందర్ రెడ్డి డైరెక్టర్లు మట్ట కిషన్ రెడ్డి రామవరం మహేందర్ రెడ్డి లతో పాటు సర్పంచులు వేముల అరుణ రాజేశం, గుర్రాల శ్రీనివాస్, కొండి రాజి రెడ్డి, ఉప సర్పంచులు యాదగిరి,విజయ్ కుమార్ గౌడ్ లతో కలిసి ఐకేపీ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం మిగతా 11 గ్రామాల్లో కొబ్బరికాయలు కొట్టి వడ్ల కొనుగోలు కేంద్రాలను ఏఎంసీ చైర్మన్ కొంగరి రవి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు కలగకుండా గ్రామీణ ప్రాంతాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడం జరుగుతుందన్నారు. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వం క్వింటాల్ వరి ధాన్యానికి 2389/- మద్దతు ధర కేటాయించడం జరిగిందని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే నేరుగా రైతుల ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు జమ చేయడం జరుగుతుందన్నారు. రైతులు దళారుల మాటలను నమ్మి మోస పోకుండా ప్రభుత్వం కేటాయించిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా వడ్ల కొనుగోలు చేపట్టాలని ఏఎంసీ చైర్మన్ కి తిమ్మాపూర్ సర్పంచ్ గుర్రాల శ్రీనివాస్ కోరారు. కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు మల్లు గారి రామచంద్రారెడ్డి,
దుబ్బాక రైతు ఉత్పత్తి దారుల సంఘం చైర్మన్ తీపిరెడ్డి రంగా రెడ్డి,కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీసీ పర్శరాములు,సీఏలు గౌతమి, రవి, కనకరాజు, సత్యపాల్, బుక్ కిపర్లు,ఆయా గ్రామాల రైతులు, హమాలీ కార్మికులు తదితరులు ఉన్నారు.


