గజ్వేల్:
గజ్వేల్ డివిజన్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో జగద్గురు ఆదిశంకరాచార్య జయంతి వేడుకలు మంగళవారం స్థానిక సీతారామ – ఉమామహేశ్వర ఆలయ ప్రాంగణంలో అత్యంత వైభవంగా జరిగాయి. ఉదయం 8 గంటల నుంచే ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో భాగంగా గణపతి పూజ, ఆదిశంకరాచార్య ఉత్సవ విగ్రహానికి పంచామృత అభిషేకం, పుష్పార్చన, మంగళహారతి మరియు మంత్రపుష్పం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు మాట్లాడుతూ సనాతన ధర్మ పరిరక్షణకు, అద్వైత సిద్ధాంత ప్రచారానికి ఆదిశంకరాచార్యులు చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన చూపిన మార్గం నేటి సమాజానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ డివిజన్ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య అధ్యక్షుడు దేశపతి శంకర్ శర్మ, కార్యదర్శి రవీందర్రావు, కోశాధికారి కృష్ణమూర్తి శర్మ, చాడ నందబాలశర్మ, ఉపాధ్యక్షుడు రాయారావు విశ్వేశ్వర్ రావు పాల్గొన్నారు. వారితో పాటు బెజుగామ నాగేందర్రావు, దేవునూరీ రాజేశ్వర్, యేగీశ్వర మురళిశర్మ, అమరవాది నీరంజన శర్మ, ఆదిరాజుపల్లె శ్రీనివాస్ శర్మ మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని పూజలు నిర్వహించారు.


