సరూర్ నగర్:
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సరూర్ నగర్ పరిధిలోని వృద్ధులకు ఆసరా సీనియర్ సిటిజెన్ గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. మంగళవారం సర్కిల్-12 డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ బి.శ్రీనివాస్ మాట్లాడుతూ.. సీనియర్ సిటిజన్లు ఈ గుర్తింపు కార్డులను వినియోగించుకుని ప్రభుత్వం కల్పించే వివిధ రాయితీలను పొందాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ కార్డులు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో యూసీడీ సిబ్బంది, ఆర్పీలు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.


